అల వైకుంఠపురములో సినిమాలోని పాటలన్నీ చార్ట్ బస్టర్స్ అయ్యాయి. ఒక సినిమాలోని అన్ని పాటలకి ఒకేలా రెస్పాన్స్ రావడం ఈ మధ్య కాలంలో అల వైకుంఠపురములో సినిమాకే జరిగిందేమో. సామజవరగమనా మొదలుకుని, రాములో రాములా.. బుట్టబొమ్మ సాంగ్ వరకూ ప్రతీదీ సూపర్ హిట్టే. థమన్ స్వరపరిచిన ఈ పాటలు శ్రోతలని ఉర్రూతలూగించాయి. అయితే ఈ సినిమాలోని అన్ని పాటలు చార్ట్ బస్టర్స్ అయినప్పటికీ, బుట్టబొమ్మ పాట మరింత ప్రత్యేకమనే చెప్పాలి.
సోషల్ మీడియాలో ఈ పాటకి విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఈ పాటలోని బన్నీ, పూజా హెగ్డే వేసిన స్టెప్పులని అనుకరిస్తూ ప్రతీ ఒక్కరూ స్టెప్పులేశారు. టాలీవుడ్ నుండి మొదలుకుని బాలీవుడ్, ఆస్ట్రేలియన్ క్రికెట్ డేవిడ్ వార్నర్ కూడా ఈ పాటకి స్టెప్పులేశాడు. అయితే వీరందరి కంటే విభిన్నంగా బుట్టబొమ్మ సాంగ్ స్టెప్పులేసిన భామ కన్నడ హీరోయిన్ పారుల్ యాదవ్ అని చెప్పవచ్చు. ఈ పాటకి డాన్స్ చేస్తూ ఎదసొంపులతో పాటు నడుమొంపులని కదిలిస్తూ గిలిగింతలు పెట్టింది.
ఈమె డాన్స్ చూసినవాళ్లంతా ఇదేం కొత్త రకం డాన్స్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. హాట్ గా కనిపించడమే కాదు, హాట్ డాన్స్ తో అందరి మతి పోగుతుంది. పారుల్ యాదల్ తెలుగు వారికి కూడా పరిచయమే. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన కిల్లింగ్ వీరప్పన్ సినిమాలో పారుల్ కనిపించింది