Advertisementt

నాగచైతన్య ఆమెని పక్కన పెట్టేసినట్లేనా..?

Wed 06th May 2020 04:51 AM
maga chaitanya,nandini reddy,samantha,vikram k kumar  నాగచైతన్య ఆమెని పక్కన పెట్టేసినట్లేనా..?
Naga chaaitanyas next movie would be with.. నాగచైతన్య ఆమెని పక్కన పెట్టేసినట్లేనా..?
Advertisement
Ads by CJ

మజిలీ, వెంకీమామా చిత్రాలతో విజయాలని అందుకున్న నాగచైతన్య, శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ స్టోరీ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ పూర్తయిందని సమాచారం. లాక్డౌన్ కారణంగా చిత్ర విడుదల వాయిదా పడింది. అయితే ఈ సినిమా అనంతరం నాగచైతన్య ఎవరి దర్శకత్వంలో సినిమా చేయనున్నాడనేది ఆసక్తిగా మారింది.

సమంత హీరోయిన్ గా నటించిన ఓ..బేబి సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో నందినీ రెడ్డి దర్శకత్వంలో నాగచైతన్య సినిమా ఉంటుందని వార్తలు వచ్చాయి. నాగచైతన్యతో సినిమా కోసం నందినీ రెడ్డి స్క్రిప్టు కూడా పూర్తి చేసిందని అంటున్నారు. అయితే ప్రస్తుతం నాగచైతన్న విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో సినిమా చేయడానికే మొగ్గు చూపుతున్నాడని టాక్.  ఈ సినిమాకి థ్యాంక్యూ అనే టైటిల్ కూడా పరిశీలనలో ఉందట.

విక్రమ్ కె కుమార్ తో సినిమా పూర్తయిన తర్వాత అష్టాచమ్మా, జెంటిల్ మేన్, సమ్మోహనం చిత్రాల దర్శకుడు ఇంద్రగంటి మోహనక్రిష్ణతో సినిమా ఉండనుందట. ఈ రెండు చిత్రాలు పూర్తయిన తర్వాతే నందినీ రెడ్డి దర్శకత్వంలో సినిమా గురించి ఆలోచిస్తాడని చెబుతున్నారు. అయితే లవ్ స్టోరీ సినిమా విడుదల అయితేగానీ అధికారిక సమాచారం బయటకి వచ్చేలా లేదు.

Naga chaaitanyas next movie would be with..:

Naga Chaitanya Next movie with

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ