Advertisementt

బన్నీ ఫ్యాన్స్ కి ఆ విషయంలో నిరాశే..?

Wed 06th May 2020 02:32 AM
bunny,allu arjun,sukumar,devi sri prasad,rashmika mandanna  బన్నీ ఫ్యాన్స్ కి ఆ విషయంలో నిరాశే..?
Dont expect from Bunny Pushpa..? బన్నీ ఫ్యాన్స్ కి ఆ విషయంలో నిరాశే..?
Advertisement
Ads by CJ

అల్లు అర్జున్ అల వైకుంఠపురములో బ్లాక్ బస్టర్ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్ గా కనిపిస్తుంది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కే ఈ సినిమా రివేంజ్ డ్రామాగా రూపొందనుందని అంటున్నారు. ఇప్పటికే రిలీజైన బన్నీ లుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.

లారీ డ్రైవర్ గా బన్నీ గెటప్ చాలా బాగుందని ప్రశంసలు వచ్చాయి. కరోనా కారణంగా సినిమా షూటింగ్ ఇంకా స్టార్ట్ అవలేదు. అయితే ఈ సినిమా పూర్తి కమర్షియల్ చిత్రమే అయినప్పటికీ, బన్నీ సినిమాల్లో ఉండే అంశాలు ఇందులో ఉండవని అంటున్నారు. ప్రత్యేకమైన కామెడీతో పాటు, ఇరగదీసే స్టెప్పులు కూడా ఉండవని ప్రచారం జరుగుతుంది. బన్నీ సినిమా అంటే ఆయన అభిమానులు డాన్సులు చూడడానికైనా సినిమా కోసం వస్తారు.

కానీ ఈ సినిమాలో అలాంటివేమీ ఉండడానికి ఆస్కారం లేదట. సినిమా పూర్తిగా గ్రామీణ నేపథ్యంలో అడవుల్లో జరుగుతుంది కాబట్టి స్టైలిష్ డాన్సెస్, ఉండవట. కాకపోతే సుకుమార్ సినిమాలో ఐటెం సాంగ్ కి ప్రత్యేకత ఉంటుంది కాబట్టి, ఆ పాటలో మాస్ స్టెప్స్ తో ఇరగదీస్తాడని.. బన్నీ అభిమానులు ఆ విషయంలో ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దని సలహా ఇస్తున్నారు.

Dont expect from Bunny Pushpa..?:

No Stylish Dances from Bunny Pushpa

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ