Advertisementt

‘ఫైటర్’‌గా విజయ్ లుక్ ఎలా ఉంటుందో..?

Tue 27th Aug 2019 11:09 AM
vijay deverakonda,fighter,fighter movie update,charmi,marshal arts  ‘ఫైటర్’‌గా విజయ్ లుక్ ఎలా ఉంటుందో..?
Vijay Devarakonda Fighter Movie Update ‘ఫైటర్’‌గా విజయ్ లుక్ ఎలా ఉంటుందో..?
Advertisement
Ads by CJ

క్రేజీ కాంబినేషన్ అయిన విజయ్ - పూరిల సినిమా నవంబర్ నుండి సెట్స్ మీదకు వెళ్లనుంది. ప్రస్తుతం విజయ్.. క్రాంతి మాధవ్ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడు. ఈమూవీ అయిన వెంటనే పూరితో సినిమా స్టార్ట్ చేస్తాడు. దీనికి ఆల్రెడీ ఫైటర్ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేసుకున్నారు. టైటిల్ తగ్గట్టుగానే ఇందులో విజయ్ టైటిల్ రోల్ చేస్తున్నాడు.

ఈమూవీలో మార్షల్ ఆర్ట్స్ ఫైటర్ గా కనిపించనున్నాడు విజయ్. దాంతో ఇప్పటినుండే ఈసినిమా పై అంచనాలు పెరిగిపోయాయి. పైగా పూరి సినిమాల్లో హీరోల లుక్ నుండి యాటిట్యూడ్ వరకు సరికొత్తగా చూపించడంలో ఆయనకు ఆయనే సాటి. ఇందులో విజయ్ ను ఎలా చూపించబోతున్నాడో అని ఇప్పటి నుండే ఎదురు చూస్తున్నారు దేవరకొండ ఫ్యాన్స్.

ఇక ఈమూవీ పూరి కనెక్ట్స్ బ్యానర్ పై ఛార్మి నిర్మించనున్నారని తెలుస్తుంది. హీరోయిన్, ఇతర నటీనటులు, మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అనేది ఇంకా తెలియాల్సిఉంది.

Vijay Devarakonda Fighter Movie Update:

Discussions about Vijay Deverakonda Look in Fighter

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ