సూపర్‌స్టార్ మహేష్‌బాబు ప్రస్తుతం తన ప్రతిష్టాత్మకమైన 25వ చిత్రంగా దిల్‌రాజు-అశ్వనీదత్-పివిపిల నిర్మాణంలో వంశీపైడిపల్లి దర్శకత్వంలో ‘మహర్షి’ చిత్రం చేస్తున్నాడు. ఇక ఈయన 26వ చిత్రం.. ‘శ్రీమంతుడు’ తీసిన మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో సుకుమార్ దర్శకునిగా ఉండనుందని అఫీషియల్ ఎనౌన్స్‌మెంట్‌తో పాటు పత్రికల్లో ప్రకటన కూడా వచ్చింది. కానీ సుక్కు ఇంకా మహేష్‌కి నచ్చే స్క్రిప్ట్ తయారు చేయకపోవడం, అందుకోసం ఆరునెలల వ్యవధి కోరడంతో ఈ చిత్రం ఆగిపోయిందని వార్తలు వస్తున్నాయి. దాంతో మహేష్ 26వ చిత్రాన్ని ‘పటాస్, సుప్రీం, రాజా ది గ్రేట్, ఎఫ్2’ చిత్రాల ద్వారా వరుస విజయాలు సాధిస్తోన్న అనిల్‌రావిపూడితో ఉండనుందని తెలుస్తోంది.
స్క్రిప్ట్ నుంచి సినిమా చిత్రీకరణ వరకు సుకుమార్‌ది నిదానమే ప్రధానం అనే టైప్. ఆయన జక్కన్న తర్వాత అంతటి వాడు. మరోవైపు సుక్కు తానే నిర్మాతగా ఇతర సంస్థల భాగస్వామ్యంతో చిన్న చిత్రాల నిర్మాణంలో బిజీగా ఉన్నాడు. అంతేకాదు.. ‘1’ (నేనొక్కడినే)ని మరిచి పోయే హిట్‌ని ఇవ్వాలనే కసి సుకుమార్‌లో ఉంది. దాంతో ఆయన మహేష్ చిత్రం స్క్రిప్ట్ విషయంలో ఎక్కువ సమయం తీసుకుంటున్నాడట. ఇక అనిల్ రావిపూడి జెట్ స్పీడు. ‘మహర్షి’ చిత్రం పూర్తయ్యేలోపే అనిల్‌రావిపూడి మహేష్‌కి బౌండెడ్ స్క్రిప్ట్ ఇచ్చేందుకు రెడీగా ఉన్నాడు. ఈ చిత్రాన్ని దిల్‌రాజుతో పాటు అనిల్‌సుంకర కలిసి భాగస్వామ్యంతో నిర్మించనున్నారు. దీనికి సంబంధించి దిల్‌రాజు- అనిల్‌సుంకరల మద్య చర్చలు కూడా సాగాయట.
అనిల్‌సుంకర గతంలో మహేష్‌తో ‘దూకుడు’ చిత్రం చేసి హిట్ కొట్టాడు. కానీ ఆ తర్వాత ‘1’ (నేనొక్కడినే), ఆగడు చిత్రాలు బాగా దెబ్బతీసిన సంగతి తెలిసిందే. ఇక మహేష్‌తో 26వ చిత్రాన్ని మైత్రి సంస్థ వదులుకోవడంపై మరో వార్త షికారు చేస్తోంది. గత ఏడాది ఈ సంస్థ నుంచి వచ్చిన ‘సవ్యసాచి, అమర్ అక్బర్ ఆంటొని’ చిత్రాలు డిజాస్టర్ అయ్యాయి. ప్రస్తుతం వారు సాయిధరమ్ తేజ్‌తో ‘చిత్రలహరి’, పంజా వైష్ణవ్‌తేజ్‌తో ఓ చిత్రం, రవితేజ-సంతోష్ శ్రీనివాస్ కాంబోలో మరో మూవీ, డియర్ కామ్రేడ్ వంటి చిత్రాలతో బిజీగా ఉన్నారు. దాంతో బడ్జెట్ విషయంలో ఆర్దికపరమైన ఇబ్బందులు ఉండటం కూడా మహేష్ చిత్రాన్ని వాయిదా వేయడానికి కారణమని ఓ వార్త ప్రచారంలో ఉంది.
అయినా మహేష్ చిత్రం అంటే ఫైనాన్షియర్స్, బయ్యర్లు అందరు పోటీ పడతారు. అలాంటిది కేవలం ఆర్ధిక సమస్యలతోనే మహేష్‌బాబు వంటి స్టార్ ఇచ్చిన అవకాశాన్ని మైత్రి సంస్థ వదులుకుంటుందా? అసలు ఈ వార్తలు నిజమేనా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.