Advertisementt

భీష్మకు తీసుకుని.. బన్నీకి మార్చారు

Sat 09th Feb 2019 01:26 PM
rashmika mandanna,heroine,allu arjun,trivikram,movie  భీష్మకు తీసుకుని.. బన్నీకి మార్చారు
Nithiin Missed and Bunny Catched భీష్మకు తీసుకుని.. బన్నీకి మార్చారు
Advertisement
Ads by CJ

ఇప్పటివరకు హీరో నితిన్‌ కెరీర్‌ని మూడు నాలుగు భాగాలుగా విభజించవచ్చు. ‘జయం, దిల్‌’ ఇలా మొదటి ఫేజ్‌లో ఆయన బాగా రాణించాడు. కానీ ఆ తర్వాత ఎంతో కాలం ఫేడవుట్‌ అయ్యాడు. నాడు ఆయన నటించిన చిత్రాలు డజనుకు పైగా ఘోరపరాజయం పాలయ్యాయి. ఇదే సమయంలో ఆయనకు విక్రమ్‌ కె.కుమార్‌తో ‘ఇష్క్‌’, విజయ్‌ కుమార్‌ కొండా దర్శకత్వంలో ‘గుండెజారి గల్లంతయ్యిందే’తో మరలా కమ్‌ బ్యాక్‌ అయ్యాడు. అదే ఊపులో పూరీ జగన్నాథ్‌తో ‘హార్ట్‌ఎటాక్‌’, ‘చిన్నదాన నీకోసం’ చిత్రాలు చేశాడు. ఇక త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో ఆయన నటించిన ‘అ..ఆ’ చిత్రంలో సమంతదే డామినేట్‌ పాత్ర అయినా హీరోగా తొలిసారి 50కోట్ల క్లబ్‌లో చేరాడు. దాంతో ఇక నితిన్‌ కెరీర్‌ గాడిన పడిందని, మంచి స్టార్‌గా ఎదుగుతాడని అందరు భావించారు. మధ్యలో నేచురల్‌ స్టార్‌ నాని, రౌడీస్టార్‌ విజయ్‌ దేవరకొండలు మంచి జోరు మీదకొచ్చారు. భారీ బడ్జెట్‌తో, యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ని తీసుకుని వచ్చి హను రాఘవపూడి దర్శకత్వంలో చేసిన ‘లై’, త్రివిక్రమ్‌, పవన్‌లు నిర్మాతలుగా తీసిన ‘ఛల్‌ మోహన్ రంగ’, దిల్‌రాజు ‘శ్రీనివాస కళ్యాణం’ వంటి డిజాస్టర్స్‌ వచ్చాయి. 

ఇక విషయానికి వస్తే ఆయన ‘ఛలో’ చిత్రం దర్శకుడు వెంకీ కుడుముల దర్శకత్వంలో ‘భీష్మ’ చిత్రానికి ఓకే చెప్పాడు. దీనిని హారిక అండ్‌ హాసిని బేనర్‌లో రాధాకృష్ణ అలియాస్‌ చిన్నబాబు నిర్మిస్తున్నాడు. కానీ ఈ చిత్రం ఎంతో కాలంగా అలానే ఉంది. షూటింగ్‌ ప్రారంభించుకోలేదు. దాంతో కొందరు నెటిజన్‌ ఆకతాయిలు ఈ చిత్రం కోసం కాస్టింగ్‌ కాల్‌ జరుగుతోందని, అవకాశం కావాలంటే డబ్బులు ఇవ్వాలని హడావుడి చేసి కొందరి నుంచి డబ్బులు దండుకున్నారు. దీంతో తీరిగ్గా ఇది ఎవరో చేసిన మోసం అని, తాము కాస్టింగ్‌ కాల్‌కి ఎవ్వరినీ ఆహ్వానించలేదని వెంకీ కుడుముల ప్రకటించాడు. గతంలో శేఖర్‌ కమ్ముల చిత్రానికి కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. మరోవైపు ‘భీష్మ’ చిత్రంలో నితిన్‌ సరసన సంచలన హీరోయిన్‌ రష్మికా మందన్నను తీసుకున్నారు. 

ఇక రాధాకృష్ణ ప్రస్తుతం అల్లుఅరవింద్‌తో కలిసి త్రివిక్రమ్‌ దర్శకత్వంలో అల్లుఅర్జున్‌ హీరోగా ఓ చిత్రం ప్రారంభించనున్నాడు. ‘భీష్మ’ ఆలస్యం అవుతూ ఉండటంతో రష్మికా మందన్న డేట్స్‌ని బన్నీ చిత్రం కోసం ఉపయోగించుకోవాలని నిర్ణయానికి వచ్చాడట చిన్నబాబు. ప్రస్తుతం రష్మికా, విజయ్‌ దేవరకొండతో ‘డియర్‌ కామ్రేడ్‌’తోపాటు తన మాతృభాష కన్నడలో స్టార్‌ హీరోల సరసన నటిస్తూ ఉంది. దాంతో ఆమె నితిన్‌ ‘భీష్మ’కి అడ్జస్ట్‌ చేసుకుని డేట్స్‌ ఇస్తుందా? లేక భీష్మని పక్కనపెట్టి అల్లుఅర్జున్‌-త్రివిక్రమ్‌ల మూవీతోనే సరిపెట్టుకుంటుందా? అనేది వేచిచూడాల్సివుంది....! 

Nithiin Missed and Bunny Catched:

Rashmika Mandanna in Allu Arjun and Trivikram Movie

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ