నిన్నమొన్నటివరకూ హీరోలు కేవలం అభిమాన సంఘాలను మాత్రమే మెయింటైన్ చేసేవారు. ఆ సంఘంలోని అభిమానులను కుదిరినప్పుడల్లా కలవడం, వాళ్ళ ఇంట్లో జరిగే ఫంక్షన్లకి అటెండ్ అవ్వడం వంటివి చేస్తూ అభిమానులకు అందుబాటులో ఉంటూ.. తమ స్టార్ డమ్ ను పెంచుకొనేవారు. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ లాంటి నిన్నటితరం కథానాయకులందరూ ఈ పద్ధతిని ఫాలో అయ్యారు. అందుకే వారిని ఇప్పటికీ కొందరు అభిమానులు వారిని తమ గుండెల్లో పెట్టుకొని పూజిస్తుంటారు. కానీ ఈ సోషల్ మీడియా వచ్చాక ఫ్యాన్స్ అసోసియేషన్స్ తగ్గిపోయాయి. ఆ స్థానంలో ఫ్యాన్ పేజెస్ మొదలయ్యాయి. ఇక అప్పటివరకూ కేవలం కలెక్షన్స్ లేదా ఓపెనింగ్స్ కోసం కొట్టుకొనే ఫ్యాన్స్ ఇప్పుడు ప్రతి చిన్న విషయానికీ కొట్టుకోవడం మొదలెట్టారు.
దాంతో ఇప్పుడు హీరోలు, వారి పి.ఆర్.ఓలు హీరోల ఫ్యాన్ పేజెస్ ను వారి కోసం సపోర్టింగ్ ఫ్యాన్ ఎకౌంట్స్ ను మెయింటైన్ చేయడం మొదలెట్టారు. కొందరు ఏదో సరదాకి అలా మైంటైన్ చేస్తుంటే.. ఒక స్టార్ హీరో మాత్రం పనిగట్టుకొని కొందరికి సాలరీ ఇచ్చి మరీ ఫేక్ ఎకౌంట్స్ ని మైంటైన్ చేయిస్తూ.. తనపై నెగిటివ్ కామెంట్స్ చేసిన వారిని తిట్టించడం, నెగిటివ్ ప్రోపగాండా చేయించడం మొదలెట్టాడు. నిన్నమొన్నటివరకూ ఆ స్టార్ హీరో ఫ్యాన్స్ నుంచి ఈ తరహా రెస్పాన్స్ ఊహించనివారందరూ ఇలా చేస్తున్నాడని తెలిసేసరికి చీప్ గా చూడడం మొదలెట్టారు. అసలు విషయం బయటకి తెలిసిపోవడంతో.. తల ఎక్కడ పెట్టుకోవాలో తెలియని ఆ స్టార్ యాక్టర్ ఎప్పట్లానే సింపుల్ గా నాకేం సంబంధం లేదు, అది నా పి.ఆర్ టీం చేసిన పని. నెక్స్ట్ టైమ్ రిపీట్ అవ్వకుండా చూసుకుంటాను అని బదులిచ్చాడట.