Advertisement

రోశయ్య ‘రహస్యం’ చెప్పేశాడు

Sun 16th Dec 2018 12:25 PM
rahasyam,pre release event,k rosaiah,c kalyan,rama satyanarayana  రోశయ్య ‘రహస్యం’ చెప్పేశాడు
K Rosaiah About Rahasyam రోశయ్య ‘రహస్యం’ చెప్పేశాడు
Advertisement

హార్రర్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వస్తోన్న ‘రహస్యం’

భీమవరం టాకీస్ పతాకంపై శైలేష్, శ్రీ రితిక జంటగా సాగర్ శైలేష్ దర్శకత్వంలో తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మిస్తోన్న చిత్రం రహస్యం. ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రసాద్ ల్యాబ్స్‌లో జరిగింది. ముఖ్య అతిథిగా మాజీ సిఏం, మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య, సి.కల్యాణ్, శివశక్తి దత్తా, రాజ్ కందుకూరి, యంగ్ హీరో మానస్, శివ శంకర్ మాస్టర్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రోశయ్య మాట్లాడుతూ.. ‘‘నిర్మాత రామసత్యనారాయణ వంద చిత్రాలకు చేరువయ్యారు. తను నాకు ఆత్మీయుడు. మంచి సినిమాను తీయటంతో పాటు దాన్ని వైవిధ్యంగా ప్రమోట్ చేస్తారు. ఈ చిత్ర ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది. టీమ్ అందరికీ మంచి పేరు తీసుకువస్తుంది. చిన్న చిత్రాల ద్వారా కూడా డబ్బు ఎలా సంపాదించాలన్నది రామ సత్యనారాయణ గారిని చూసి నేర్చుకోవాలి..’’ అని అన్నారు.

సి.కల్యాణ్ మాట్లాడుతూ.. ‘‘రామసత్యనారాయణ సినిమాను ప్రేమించే వ్యక్తి. వంద చిత్రాలను తీసిన తెలుగు నిర్మాతగా రామానాయుడు గారు, రామ సత్యనారాయణ నిలిచిపోతారు. తన సినిమా ఫంక్షన్ అంటే అది నా సినిమా ఫంక్షన్ లానే ఉంటుంది‌. రహస్యంతో ఆయన లాభాలను సాధించాలని కోరుకుంటున్నాను..’’ అన్నారు.

రామసత్యనారాయణ మాట్లాడుతూ.. ‘‘కంటెంట్ బాగుంటేనే ఈ రోజు ఎంతటి స్టార్ హీరో సినిమా అయినా ఆడుతోంది. లేదంటే ప్రేక్షకులు ఎలాంటి మోహమాటం లేకుండా తిరస్కరిస్తున్నారు. రహస్యం కంటెంట్ ఉన్న చిత్రం. ఈ సినిమాను ముందు నుంచి ప్రమోట్ చేస్తోన్న వివి.వినాయక్, పూరీ జగన్నాథ్, రామ్ గోపాల్ వర్మ, రాజ్ కందుకూరి, శ్రీకాంత్ గారికి ధన్యవాదాలు. రోశయ్య గారి ఆశీస్సులు ఎప్పుడు నాకు ఇలానే ఉండాలి. ఈ సినిమా విడుదలకు రెండు రోజుల ముందే ప్రెస్ షో వేసి చూపిస్తాను..’’ అని అన్నారు.

హీరో శైలేష్ మాట్లాడుతూ.. ‘‘కంటెంటే ప్రధాన బలంగా, రామ సత్యనారాయణ గారి సపోర్ట్‌తో రహస్యం రూపొందించబడింది. అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను..’’ అన్నారు. 

ఈ చిత్రానికి సంగీతం: కబీర్ రఫీ, కెమెరా: సుధాకర్.

K Rosaiah About Rahasyam:

Rahasyam Movie Pre Release Event

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement