Advertisement

నందినిరెడ్డిని భ‌య‌పెడుతున్న నాని!

Sat 15th Dec 2018 03:32 PM
nani,nandinireddy,miss granny,samantha,maheshbabu,s.j.surya,korean film,  నందినిరెడ్డిని భ‌య‌పెడుతున్న నాని!
nani rtoubles to nandinireddy నందినిరెడ్డిని భ‌య‌పెడుతున్న నాని!
Advertisement

క‌మ‌ర్షియ‌ల్ క‌థానాయిక‌గా మంచి క్రేజ్‌ని సొంతం చేసుకున్న స‌మంత ప్ర‌స్తుతం ప్ర‌యోగాత్మ‌క చిత్రాల‌కు సిద్ధ‌మ‌వుతోంది.  `రాజు గారి గ‌ది-2` నుంచి త‌న పంథా మార్చుకుని కొత్త త‌ర‌హా చిత్రాల‌కే అధిక ప్రాధాన్య‌త‌నిస్తోంది. త‌న పాత్రతో పాటు క‌థ‌లో న‌వ్య‌త వుంటేనే అందులో న‌టించ‌డానికి ఆస‌క్తిని చూపిస్తోంది. నాగ‌చైత‌న్య‌తో వివాహం త‌రువాత కొత్త త‌ర‌హా చిత్రాల ప‌రంగా జోరు పెంచేసింది. ఇటీవ‌ల ఆమె న‌టించిన `రంగ‌స్థ‌లం`, `మ‌హాన‌టి`, `యుట‌ర్న్‌` వంటి చిత్రాలు ఆనూహ్య విజ‌యాన్ని సాధించ‌డంతో ప్ర‌యోగాత్మ‌క‌ చిత్రాల్లో న‌టించ‌డానికి రంగం సిద్ధం చేసుకుంటోంది.  తాజాగా స‌మంత ఓ ప్ర‌యోగాత్మ‌క చిత్రానికి గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చేసింది. 

లేడీ డైరెక్ట‌ర్ నందిని రెడ్డి తెలుగులో రీమేక్ చేయ‌బోతున్న చిత్రం `మిస్ గ్రానీ`. అర‌వై ఏళ్ల బామ్మ ఇర‌వై ఏళ్ల యువ‌తిగా రూపాంత‌రం చెంద‌డం అనే గ‌మ్మ‌త్తైన క‌థ‌తో  రూపొందిన‌ ఈ కొరియ‌న్ సినిమాను తెలుగు నేటివిటీకి మార్పులు చేర్పులు చేసి త్వ‌ర‌లో  తెర‌పైకి తీసుకురాబోతోంది నందినిరెడ్డి. ఇందులో అర‌వై ఏళ్ల బామ్మ‌గా, యంగ్ లేడీగా స‌మంత రెండు భిన్న‌మైన పాత్ర‌ల్లో న‌టించ‌డానికి గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చేసింది. త్వ‌ర‌లో సెట్స్ పైకి రాబోతున్న ఈ సినిమాకు `ఓ బేబీ` అనే టైటిల్‌ను ఖరారు చేశారు. `ఎంత స‌క్క‌గున్నావే` అనేది ట్యాగ్ లైన్‌. 

`జ‌బ‌ర్ద‌స్త్‌`తో విమ‌ర్శ‌ల పాలైన నందినిరెడ్డికి ఈ సినిమా విష‌యంలోనూ ఓ అడ్డంకి క‌నిపిస్తోంది. గతంలో ఇదే త‌ర‌హా క‌థ‌తో మ‌హేష్‌బాబు న‌టించిన `నాని` వ‌చ్చింది. ఎస్‌.జె.సూర్య ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన‌ ఈ సినిమా క‌థ‌కు `మిస్ గ్రానీ`కి ద‌గ్గ‌రి సంబంధిం వుండ‌టంతో నందినికి ఈ సినిమా పెద్ద అడ్డంకిగా మారింది. దీంతో ఆమెకు ఈ సినిమా కూడా బెడిసి కొడుతుందా? అని అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. `నాని` చిత్రాన్ని మ‌రిపించే స్థాయిలో `ఓ బేబీ`ని మ‌లిస్తే నందినిరెడ్డి ద‌ర్శ‌కురాలిగా కొత్త ప్ర‌యాణం మొద‌లుపెట్ట‌డం ఖాయం. లేదంటే మ‌ళ్లీ పాత దారి ప‌ట్ట‌క త‌ప్ప‌దు.  

nani rtoubles to nandinireddy:

nani rtoubles to nandinireddy

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement