Advertisementt

ఈ టీజర్ చాలా బాగుంది: మారుతి

Fri 23rd Nov 2018 10:59 PM
manchu kurise velalo teaser,manchu kurise velalo,manchu kurise velalo movie,maruthi director,bala  ఈ టీజర్ చాలా బాగుంది: మారుతి
Maruthi Launches Manchu Kurise Velalo Teaser ఈ టీజర్ చాలా బాగుంది: మారుతి
Advertisement
Ads by CJ

‘మంచు కురిసే వేళలో’ టీజర్ లాంచ్ చేసిన స్టార్ డైరెక్టర్ మారుతి

కనులకు పండుగలా అనిపించే లొకేషన్స్‌తో మనసుని హత్తుకునే సంగీతంతో ‘మంచు కురిసే వేళలో’ కచ్చితంగా విజయం అందుకుంటుందని ఆశిస్తున్నారు అన్నారు.. స్టార్ డైరెక్టర్ మారుతి. రామ్ కార్తీక్, ప్రనాలి జంటగా బాల బోడెపూడి స్వీయ దర్శకత్వంలో ప్రణతి ప్రొడక్షన్ పతాకంపై తెరకెక్కుతోన్న ‘మంచు కురిసే వేళలో’ సినిమా టీజర్‌ను లాంచ్ చేశారు మారుతి.

అనంతరం దర్శకుడు ఆయన మాట్లాడుతూ.. ‘‘టీజర్ చాలా బాగుంది.. ఫోటోగ్రఫీ అద్భుతంగా ఉంది. చాలా చోట్ల తిరిగి మంచి ఔట్ డోర్ లొకేషన్స్ లో సినిమాను షూట్ చేశారు. టీజర్.. సినిమా క్వాలిటీని తెలియజేసేలా ఉంది. టీజర్ చూస్తే హీరో రామ్ కార్తీక్ చాలా అనుభవం ఉన్నట్టుగా నటించాడనిపించింది. టీం అందరికీ ఈ సినిమా మంచి బ్రేక్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను..’’ అన్నారు.

దర్శక నిర్మాత బాల మాట్లాడుతూ.. ‘‘మంచు కురిసే వేళలో అందమైన లొకేషన్స్‌లో అంతే అందమైన కథ కథనాలతో తీసిన స్వచ్చమైన ప్రేమకథ. సంగీతం, సినిమాటోగ్రఫీ సినిమాకు పెద్ద ‌ఎసెట్‌గా నిలుస్తాయి. రామ్ కార్తీక్ కెరీర్‌లో ఇదొక ఉత్తమ చిత్రమవుతుంది. చిత్రీకరణ పూర్తయింది. నిర్మాణాంతర కార్యక్రమాలను కంప్లీట్ చేశాము. ఈ నెలలో ఆడియోను విడుదల చేసి డిసెంబర్‌లో సినిమాను విడుదల చేస్తాము..’’ అన్నారు.

ఈ చిత్రానికి సంగీతం: శ్రావణ్ భరద్వాజ్, కెమెరా: తిరుజ్ఞాన, ప్రవీణ్ కుమార్ పంగులూరి, పి.ఆర్.ఓ: సాయి సతీష్, కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు, కధ- స్క్రీన్ ప్లే- నిర్మాత- దర్శకత్వం: బాల బోడెపూడి

Click Here for Teaser

Maruthi Launches Manchu Kurise Velalo Teaser:

Manchu Kurise Velalo Teaser Release Details

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ