ఈ మధ్యన మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ టైం అస్సలు బాగోలేదు. నిన్నగాక మొన్న సవ్యసాచితో ప్లాప్ అందుకున్న మైత్రి మూవీస్ వారు నిన్న అమర్ అక్బర్ ఆంటొనితో డిజాస్టర్ అందుకున్నారు. అయితే ఇప్పుడు తాజాగా మరోప్లాప్ హీరో కోసం మైత్రి మూవీస్ వారు రంగంలోకి దిగబోతున్నారనే న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అది కూడా యంగ్ టైగర్ ఎన్టీఆర్ చెప్పాడని.. ఆ హీరోతో సినిమా చేయడానికి మైత్రి వారు ఒప్పుకున్నారని టాక్ నడుస్తుంది. మైత్రి మూవీస్‌కి, ఎన్టీఆర్‌కి జనతా గ్యారేజ్ అప్పుడు బాగా అనుబంధం ఏర్పడింది. జనతా గ్యారేజ్ రివ్యూస్ నెగెటివ్.... కలెక్షన్స్ పాజిటివ్‌గా వచ్చిన విషయం తెలిసిందే. ఎన్టీఆర్ స్టామినాతో జనతా గ్యారేజ్ కి అదిరిపోయే కలెక్షన్స్ వచ్చి మైత్రి వారు ఒడ్డున పడ్డారు.
అయితే ఎన్టీఆర్ కి మైత్రి వారికీ ఉన్న అనుబంధంతో ఎన్టీఆర్ ఇపుడు మైత్రి మూవీస్ ని ఒక కోరిక కోరాడట. అదేమిటంటే తన అన్న కళ్యాణ్ రామ్ కోసం మైత్రి వారిని ఒక సినిమా చెయ్యమని యంగ్ టైగర్ అడిగినట్టుగా చెబుతున్నారు. కళ్యాణ్ రామ్ ప్రస్తుతం ప్లాప్స్ తో సతమతమవుతున్నాడు. కెరీర్ మొదట్లో అతనొక్కడే తో హిట్ అందుకున్న కళ్యాణ్ రామ్ మళ్ళీ పదేళ్లకు పటాస్ తో హిట్ అందుకున్నాడు. ఇక మళ్ళి ఎప్పటిలాగే ప్లాప్స్ కొడుతున్నాడు. అయితే గతంలోనే తన అన్న నిర్మాతగా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు జై లవ కుశ సినిమా చేసి కళ్యాణ్ రామ్ ని ఒడ్డున పడేసిన ఎన్టీఆర్ మళ్ళీ ఇప్పుడు కళ్యాణ్ రామ్ కెరీర్ ని సెట్ చెయ్యాలనుకుంటున్నాడట.
కళ్యాణ్ రామ్ బయట నిర్మాతలకు హీరోగా సినిమాలు చేస్తున్నాడు. అయితే మైత్రి మూవీస్ వారు అయితే మంచి కథతో మంచి దర్శకులతో సినిమాలు చేస్తూ హిట్స్ ఇస్తారు కాబట్టి తన అన్నకు కూడా ఒక సినిమా చెయ్యమని ఎన్టీఆర్ మైత్రి మూవీస్ నిర్మాతలను అడిగినట్లుగా సోషల్ మీడియా టాక్. మరి ప్రస్తుతం వరసగా ప్లాప్స్ కొడుతున్న మైత్రి వారు ఎన్టీఆర్ అడిగితే మాత్రం మరో ప్లాప్ హీరో తో సినిమా చేసి చేతులు కాల్చుకోవడానికి రెడీ అవుతారా.. లేదా అనేది మాత్రం కాస్త అనుమానమే. అయితే ఈ వార్తలు ఎంత వరకు నిజం అనేదానిపై క్లారిటీ మాత్రం లేదు.