మరికొన్ని రోజుల్లో రజిని 2.0 హంగామా స్టార్ట్ అవ్వబోతుంది. తెలుగు రాష్ట్రాల్లో ఈసినిమాకి అంతగా క్రేజ్ లేకపోయినా ఎన్వి ప్రసాద్, దిల్ రాజు కలిసి ఈసినిమాను 80 కోట్లు పెట్టి కొన్నారు. దాంతో ఈసినిమాను తెలుగు రాష్ట్రాలలో ఉన్న ధియేటర్లలో 29న మొత్తం 90 శాతం థియేటర్లలో 2.0నే ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. దీని కోసం ఇప్పటికే రంగం కూడా సిద్ధం చేస్తున్నారు. 80 కోట్లు షేర్ వస్తేనే ఈసినిమా సేఫ్ జోన్ లో కి వెళ్లినట్టు లేకపోతే లేనట్టు.
తెలుగులో ఇది ఇండస్ట్రీ హిట్ అయితే తప్ప అంత వసూల్ రావడం కష్టం. విడుదల రోజు పాజిటిల్ వస్తే.. సేఫ్ జోన్‌లోకి వెళ్లే అవకాశం ఉందేమో కానీ.. నెగటివ్ టాక్ వస్తే మాత్రం నిర్మాతలకు కష్టాలు తప్పవు. కానీ మనోళ్లకి డైరెక్టర్ శంకర్ మీద కాన్ఫిడెన్స్ ఎక్కువ. అతను ఏదొక మాయ చేసి విజువల్ మాయాజాలం చేస్తాడని నమ్ముతున్నారు. ఇక తమిళనాడు గురించి వేరే చెప్పనవసరం లేదు. అక్కడ 99 శాతం ధియేటర్లలో 2.0నే ఉంటుందట. ఆ రోజు గవర్నమెంట్ స్కూల్స్..ఆఫీస్‌లు..కొన్ని ప్రైవేట్ స్కూల్స్ కి సెలవు ఇస్తున్నారు. దాంతో ఈసినిమా అక్కడ ఇండస్ట్రీ రికార్డులు బద్దలుకొట్టడం పెద్ద కష్టం ఏమీ కాదు.
భారతీయ సినిమా చరిత్రలో అత్యంత ఖరీదైన సినిమాగా ఇప్పటికే ప్రచారం చేస్తున్నారు. వరల్డ్ వైడ్ గా ఈసినిమా ఐదు వందల కోట్ల షేర్ టార్గెట్ తో రంగంలోకి దిగుతుంది. మరి కొన్ని రోజుల్లో ఈసినిమా జాతకం ఏంటో అర్ధం అయిపోతుంది. ట్రైలర్ అంతగా జనాలకి ఎక్కకపోయినా సినిమాతో మాత్రం ఫిదా అవుతారు అని చెబుతున్నారు.