Advertisementt

త్రివిక్రమ్ చేతుల్లో ‘శుభలేఖ+లు’

Tue 20th Nov 2018 03:59 PM
trivikram srinivas,subhalekhalu,support,trailer launch,bellam rama krishna reddy  త్రివిక్రమ్ చేతుల్లో ‘శుభలేఖ+లు’
Trivikram Launches Subhalekhalu Second Trailer త్రివిక్రమ్ చేతుల్లో ‘శుభలేఖ+లు’
Advertisement
Ads by CJ

‘శుభలేఖ+లు’ రెండ‌వ ట్రైల‌ర్‌ని ఆవిష్క‌రించిన త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్‌ 

ఇటీవల కాలంలో ఓ ప్రత్యేకమైన అటెన్షన్ రప్పించుకున్న చిత్రం ‘శుభలేఖ+లు’. పోస్టర్, టీజర్, థియేట్రికల్ ట్రైలర్ చాలా విభిన్నంగా ఉండటంతో అటు ఆడియన్స్‌లోనూ, ఇటు మార్కెట్‌లోనూ ఓ క్యూరియాసిటీ సొంతం చేసుకున్నదీ చిత్రం. పుష్య‌మి ఫిల్మ్ మేక‌ర్స్ అధినేత బెల్లం రామ‌కృష్ణారెడ్డి ఈ చిత్రాన్ని చూసి ఫ్యాన్సీ ఆఫ‌ర్స్‌తో వ‌ర‌ల్డ్ వైడ్ రైట్స్ ద‌క్కించుకుని గ్రాండ్‌గా విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. హ‌నుమ తెలుగు మూవీస్ పతాకం పై రూపుదిద్దుకున్న ఈ చిత్రం డిసెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సంద‌ర్భంగా సినిమా రెండో ట్రైల‌ర్‌ను ప్ర‌ముఖ స్టార్ డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ ఆవిష్క‌రించారు. 

ఈ కార్య‌క్ర‌మంలో నిర్మాతలు మాట్లాడుతూ... ‘‘ఇటీవ‌లే విడుద‌లైన మా ట్రైల‌ర్‌కిగాని, టీజ‌ర్‌కిగాని ఇంత అద్భుత‌మైన స్పంద‌న ల‌భించడం చాలా ఆనందంగా ఉంది. ఇండ‌స్ట్రీలో ఉన్న పెద్ద‌లంద‌రూ చూసి త‌మ మాట‌లతో మంచి పాజిటివ్ ఎన‌ర్జీని అందిస్తున్నారు. ఇంత మంది ప్ర‌ముఖుల ఆద‌ర‌ణ ఈ సినిమాకి ల‌భించ‌డం చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా ట్రైల‌ర్‌ని మేము అడిగిన వెంట‌నే త్రివిక్ర‌మ్‌గారు విడుద‌ల చేయ‌డం చాలా సంతోషం ఆయ‌న‌కు మా ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు..’’ అన్నారు. ఇంకా ఈ కార్య‌క్ర‌మంలో నిర్మాత‌లు విద్యాసాగ‌ర్‌, జ‌నార్ధ‌న్‌, బెల్లం కృష్ణారెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు.

Trivikram Launches Subhalekhalu Second Trailer:

Director Trivikram Srinivas Support to Subhalekhalu Movie

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ