మరో మహా యజ్ఞం మొదలైంది. ‘బాహుబలి’ని చెక్కిన జక్కన మరో చరిత్రను సృష్టించేందుకు శ్రీకారం చుట్టారు. నవంబర్ 11న అఫీషియల్‌గా పూజా కార్యక్రమాలు జరిగిన ఈ చరిత్ర.. ఇప్పుడే రికార్డులోకి ఎక్కుతోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్‌లో దర్శకధీరుడు ఎస్. ఎస్. రాజమౌళి తెరకెక్కించబోతోన్న ‘ఆర్ఆర్ఆర్’ రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌లో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని డివీవీ దానయ్య నిర్మిస్తున్నారు.
ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైనట్లుగా నవంబర్ 19న ఉదయం ట్విట్టర్‌లో ఓ పోస్ట్ చేసిన రాజమౌళి.. ఆ పోస్ట్‌తోనే టాప్ ట్రెండింగ్‌ను క్రియేట్ చేశాడు. తన హీరోలిద్దరితో కూర్చుని ఉన్న ఆ ఫొటో ఉన్న నెట్టంతా వైరల్ అయింది. ఇక ఫొటోతోనే కాకుండా ఓ వీడియో కూడా ఆర్ఆర్ఆర్ టీమ్ విడుదల చేసింది.
ఇందులో వన్ అండ్ ఓన్లీ రాజమౌళి వాయిస్ మాత్రమే ఉన్నా.. ఆయన నోటి వెంటే తారక్, చరణ్ అంటూ చెబుతూ.. టేక్, క్లాప్, యాక్షన్ అంటూ తొలి షాట్ వీడియోలో రాజమౌళి చెబుతుంటే.. చరిత్రను ఒక్కసారి కళ్లముందు చూసినట్లుగా ప్రేక్షకులు ఫీలవుతున్నారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాని అతలాకుతలం చేస్తుందంటే నమ్మాలి మరి. భారీ బడ్జెట్‌తో తెరకెక్కబోతోన్న ఈ చిత్రం 2020లో విడుదల కానుంది.