2018 లో రామ్ చరణ్.. సుకుమార్ దర్శకత్వంలో రంగస్థలం సినిమా బ్లాక్ బస్టర్ హిట్ తో కెరీర్ లోనే పదికాలాలు గుర్లుండిపోయే హిట్ అందుకున్నాడు. ఇక జూనియర్ ఎన్టీఆర్ కూడా త్రివిక్రమ్ దర్శకత్వంలో అరవింద సమేత తో హిట్ కొట్టాడు. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్ కొడితే, ఎన్టీఆర్ మాత్రం హిట్ కొట్టాడు. అయితే ఈ ఇద్దరు హీరోలు ఇప్పుడు రాజమౌళి డైరెక్షన్ లో RRR అనే మల్టీస్టారర్ లో నటిస్తున్నారు. అయితే రామ్ చరణ్ రంగస్థలం తర్వాత బోయపాటి సినిమా వినయ విధేయ రామ లో నటిస్తున్నాడు. ఎన్టీఆర్ మాత్రం రాజమౌళి RRR కోసం ఫ్రీ అయ్యాడు. మరే కమిట్మెంట్స్ లేవు. ఇక రాజమౌళి సినిమా కోసం ఈ స్టార్ హీరోలిద్దరు 200 రోజుల కాల్షీట్స్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. మరి 200 రోజుల కాల్షీట్స్ అంటే.. RRR పూర్తయ్యేసరికి ఏడాదిన్నర నుండి రెండేళ్లు పట్టడం ఖాయం.
అందుకే 2019 లో ఎన్టీఆర్ మాత్రం తన సినిమాతో అభిమానుల ముందుకు రాడు. అలాగే పెద్దగా బయట కూడా కనబడడు. కానీ రామ్ చరణ్ మాత్రం 2019 లో వినయ విధేయ రామ సినిమాతో 2019 సంక్రాంతికి అభిమానులను హ్యాపీ చేస్తాడు. సో అలా ఎన్టీఆర్ 2019 లో మాయమైతే... రామ్ చరణ్ మాత్రం 2019 లో ఒక సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తాడు. ఇక 2020 రాజమౌళి RRR మల్టీస్టారర్ విడుదలవుతుందనేది తెలిసిన విషయమే.
పాపం ఎన్టీఆర్, రాజమౌళి సినిమాకి కమిట్ అయ్యాక మరో సినిమా చెయ్యలేడు. అందుకే 2019 లో ఏడాదంతా ఎన్టీఆర్ అభిమానులు RRR సంబంధించి వచ్చే ఎన్టీఆర్ లుక్ తో సరిపెట్టుకోవాల్సిందే. పూర్తిగా ఎన్టీఆర్ విశ్వరూపం చూడాలి అంటే 2020 వరకు ఆగాల్సిందే . కానీ రామ్ చరణ్ మాత్రం వచ్చే సంక్రాంతికి వినయ విధేయ రామతో హడావిడి చేస్తాడు. బాహుబలికి ప్రభాస్ ఐదేళ్లు త్యాగం చేసిన విషయం తెలిసిందే. కానీ ఈసారి మాత్రం ఎన్టీఆర్, చరణ్ అన్ని ఏళ్ళు త్యాగం చేయక్కర్లేదని రాజమౌళి ఈ స్టార్ హీరోలకు మాటిచ్చాడటలే.