Advertisementt

ఈ టీజర్ కి ఇన్ని వ్యూసా..?

Sat 17th Nov 2018 03:10 PM
nenu lenu,1m views,nenu lenu teaser,nenu lenu movie  ఈ టీజర్ కి ఇన్ని వ్యూసా..?
1 M Views to Small Movie Teaser ఈ టీజర్ కి ఇన్ని వ్యూసా..?
Advertisement
Ads by CJ

ఓ.య‌స్‌.యం విజన్ మ‌రియు దివ్యాషిక క్రియేష‌న్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘నేను లేను’. లాస్ట్ ఇన్ లవ్ అనేది ఉప‌శీర్షిక‌. హ‌ర్షిత్ హీరోగా  న‌టిస్తున్నాడు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. టీజర్ విడుదలై వన్ మిలియన్ వ్యూస్ ను అందుకుంది. 

ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు రామ్ కుమార్ మాట్లాడుతూ ... అందమైన ప్రేమకథతో  సైకలాజికల్ థ్రిల్లర్ గా తెర‌కెక్కిన చిత్రం నేను లేను . ఇటివలే విడుదలైన మా టీజర్ కి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ రావడం చాలా ఆనందంగా ఉంది. మంచి కాన్సెప్ట్ తో  సినిమా తీస్తే  ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు అనే నమ్మకంతో  తీసిన చిత్రం ‘నేను లేను’ విడుదలైన మా టీజర్ కి వన్ మిలియన్ వ్యూస్ రావడం సినిమాపై మరింత నమ్మకాన్ని పెంచింది. అన్ని కార్యక్రమాలు పూర్తి  చేసి త్వరలోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. ఇప్పటి వరకు సినీ చరిత్రలో రాని  సరికొత్త కాన్సెప్ట్ తో వస్తున్న చిత్రం అని చెప్పడానికి చాలా  గర్వంగా ఫీల్ అవుతున్నామన్నారు.

హ‌ర్షిత్‌, వంశీకృష్ణ‌ పాండ్య‌, శ్రీ‌ప‌ద్మ‌, మాధ‌వి, బిశ్వ‌జిత్‌నాధ్‌, రుద్ర‌ప్ర‌కాశ్‌, వేల్పుల‌ సూరి, యుగంధ‌ర్ త‌దిత‌రులు న‌టిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ఆశ్రిత్‌, ఛాయాగ్ర‌హ‌ణం: ఎ. శ్రీ‌కాంత్ (బి.ఎఫ్‌.ఎ), నృత్యాలుః జోజో, నిర్వాహ‌ణ: సురేష్‌ కూర‌పాటి, పి.ఆర్‌.ఓ‌: సాయిస‌తీష్‌, విఎఫ్ఎక్స్: ప్రభురాజ్‌, ఎస్.ఎఫ్.ఎక్స్: పురుషోత్తం రాజు, ఆడియోగ్ర‌ఫీ: రంగ‌రాజ్‌, క‌ల‌రిస్ట్ః క‌ళ్యాణ్ ఉప్పాల‌పాటి, ప్ర‌చార చిత్రాలు: శ్రీ‌క‌, స‌హాయ‌ ద‌ర్శ‌కులు: జె.మోహ‌న్‌కాంత్‌, ద‌ర్మేంద్ర‌, సురేశ్‌, సహ నిర్మాత: యాషిక, నిర్మాత: సుక్రి కుమార్   రచన, దర్శకత్వం: రామ్ కుమార్ ఎమ్.ఎస్.కె

1 M Views to Small Movie Teaser:

Nenu Lenu Film Teaser Got 1M Views

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ