Advertisementt

మహేషే కాదు ఏ హీరోని అడగలేదు: శ్రీనువైట్ల

Fri 16th Nov 2018 07:50 PM
srinu vaitla,mahesh babu,raviteja,movies,srinu vaitla,latest,interview  మహేషే కాదు ఏ హీరోని అడగలేదు: శ్రీనువైట్ల
Srinu Vaitla Sensational Comments on Mahesh babu మహేషే కాదు ఏ హీరోని అడగలేదు: శ్రీనువైట్ల
Advertisement
Ads by CJ

టాలీవుడ్‌కు సరికొత్త కామెడీని పరిచయం చేసిన దర్శకుడు ఎవరు? అంటే ఖచ్చితంగా అందరూ శ్రీనువైట్ల పేరే చెబుతారు. అయితే అది కొన్ని సినిమాల వరకే వర్తించింది. తర్వాత అందరూ అదే దారిలో వెళ్లడంతో రొటీన్ అయిపోయి చివరికి వెగటుగా మారింది. అయినా శ్రీనువైట్ల మారకుండా.. అదే తరహా చిత్రాలు తీయడంతో.. ప్రస్తుతం ఆయన గమ్యమే క్లిష్టపరిస్థితిని ఎదుర్కొంటుంది. ప్రస్తుతం ఆయన దర్శకత్వం వహించిన ‘అమర్ అక్బర్ ఆంటోని’ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఈచిత్ర ప్రమోషన్ కార్యక్రమాలలో జోరుగా పాల్గొంటున్న శ్రీనువైట్ల తాజాగా మహేష్ బాబు గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

వరుస పరాజయాల తర్వాత మీరు మళ్లీ సూపర్‌స్టార్‌ను కలిసి ఒక సినిమా చేయాలని కోరినట్లుగా వార్తలు వచ్చాయి? నిజమేనా? అని ఇటీవల ఓ ఇంటర్య్వూలో శ్రీనువైట్లను మీడియావారు అడిగారు. దీనికి సమాధానంగా.. ‘‘మహేశ్‌గారు నాకు మంచి స్నేహితుడు. ప్లాపుల్లో ఉన్నాను.. ఒక సినిమా చేసి పెట్టండి అని నేను ఎప్పుడూ మహేష్‌గారిని అడగలేదు. మహేష్ అనే కాదు నేను ఏ హీరో దగ్గరకి అలా వెళ్లను. నా దగ్గర ఉన్న స్ర్కిఫ్ట్‌కి ఏ హీరో అయితే సరిపోతాడో.. ఆ హీరోని మాత్రమే కలిసి కథ వినిపిస్తాను. కథ వారికి నచ్చితే చేస్తామంటారు. లేదంటే మరో కథ ఏదైనా చూడమంటారు. అంతే తప్ప బలవంతంగా ఏ హీరో దర్శకుడిని నమ్మి సినిమా చేయరు. అయితే రవితేజ మాత్రం నాకు ట్రబుల్ షూటర్ లాంటివాడు. నేను ప్లాపుల్లో ఉన్న ప్రతిసారి నాతో సినిమా చేసేందుకు రెడీ అంటూ ధైర్యానిస్తాడు..’’ అని శ్రీనువైట్ల తెలిపాడు.

Srinu Vaitla Sensational Comments on Mahesh babu:

Srinu Vaitla Latest Interview

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ