Advertisementt

ముద్దు తెచ్చిన తంట: ఛోటా.కె బ్యాన్..!!

Thu 15th Nov 2018 01:09 AM
kajal agarwal,kiss,chota k naidu,trolling,kajal agarwal fans  ముద్దు తెచ్చిన తంట: ఛోటా.కె బ్యాన్..!!
Kajal Fans Trolling in Chota K Naidu ముద్దు తెచ్చిన తంట: ఛోటా.కె బ్యాన్..!!
Advertisement
Ads by CJ

బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా తెరకెక్కుతున్న ‘కవచం’ టీజర్ లాంచ్ వేడుకలో సినిమాటోగ్రాఫర్ ఛోటా కె నాయుడు, కాజల్‌కి హఠాత్తుగా మీద మీద పడి ముద్దు పెట్టి ఆలింగనం చేసుకున్న ఫొటోస్ సోషల్ మీడియా, వెబ్ మీడియా ఇంటర్నెట్‌లో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. ఛోటా కె నాయుడు హీరోయిన్ కాజల్ కి అలా బహిరంగంగా ముద్దు పెట్టడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాజల్ లైట్ తీసుకున్నా.. చాలామంది ఛోటా మీద కన్నెర్రజేస్తున్నారు. కాజల్ ఫ్యాన్స్ అయితే ఛోటా కె నాయుడిని ట్రోల్ చేస్తూ సోషల్ మీడియాలో ఆడుకుంటున్నారు.

బ్యాన్ ఛోటా కె నాయుడు ఫ్రమ్ టీఎఫ్ఐ అంటూ హ్యాష్ ట్యాగ్ పెట్టి మరి చోటాకి నీళ్లు తాగించినంత పనిచేస్తున్నారు. ఎంతగా హీరోయిన్స్ తో క్లోజ్ గా ఉన్నప్పటికీ.. ఇలా బహిరంగంగా మీడియా ఉందన్న ధ్యాస కూడా లేకుండా అందరి ముందు అలా ముద్దు పెట్టడం ఏమిటి చెప్మా అంటూ పెదవి విరుస్తున్నారు. మరి సినిమాటోగ్రాఫర్ గా టాప్ పొజిషన్ లో ఉన్న ఛోటా కె నాయుడికి ఈ సరదా ముద్దు వ్యవహారం పెద్ద తలనొప్పిగా మారింది. ఛోటాని అందరూ ఫుడ్ బాల్ ఆడుకుంటున్నట్టుగా ఆడుకుంటున్నారు. కేవలం కామెంట్స్ తోనే సరిపెట్టడం లేదు... గతంలో ఛోటా హీరోయిన్స్ మీద చేసిన కామెంట్లు ఇప్పుడు మళ్లీ సోషల్ మీడియాలో వీర విహారం చేస్తున్నాయి.

కొంతమంది ఛోటాని టార్గెట్ చేస్తూ గతంలో ఛోటా చేసిన నీచమైన కామెంట్స్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఛోటా కె నాయుడికి చుక్కలు చూపెడుతున్నారు. రుద్రమదేవి సినిమా షూటింగ్ లో ఉన్నప్పుడు హీరోయిన్లంటే తనకు మోజు అని... ఛోటా మాట్లాడిన  వీడియోలు, అలాగే నిత్యామీనన్ విషయంలో ఒక సినిమాకు సంబందించిన ఆడియో వేడుకలో బహిరంగంగా ఐ లవ్ యు నిత్యా అంటూ కామెంట్ చెయ్యడమే కాకుండా నా భార్య తర్వాత నాకు బంగారం అనిపించింది నిత్యా ఒక్కటే.. వెటకారంగా మాట్లాడిన వీడియోలను కాజల్ అభిమానులు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఛోటా కె నాయుడుకి దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయ్యేలా చేస్తున్నారు.

Kajal Fans Trolling in Chota K Naidu:

Chota K Naidu Trolled by Kajal agarwal Fans in Social Media

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ