విజయ్, మురగదాస్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘సర్కార్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలనాలను క్రియేట్ చేస్తోంది. నిజానికి ఈ సినిమాకి టాక్ ఏమంత బాగా రాకపోయినప్పటికీ, కలెక్షన్ల పరంగా మాత్రం ఇప్పటికే రికార్డులను తిరగరాస్తోంది. అయితే విజయ్ సినిమాలు అనగానే ఈ మధ్య ఏదో ఒక కాంట్రవర్సీ అవుతూనే ఉన్నాయి. ఆ కాంట్రవర్సీతోనే టాక్‌తో సంబంధం లేకుండా కలెక్షన్లు కుమ్మేస్తున్నాడు విజయ్. దీనికి ఉదాహరణ అప్పుడు మెర్సల్. ఇప్పుడు సర్కార్.
ఇక విషయంలోకి వస్తే.. ‘సర్కార్’ చిత్రాన్ని చూసిన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ తన ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేశాడు. ఇదే యంగ్‌టైగర్ ఎన్టీఆర్ అభిమానులకు కోపాన్ని తెప్పించింది. అదేంటి మహేష్ వేరే ఎవరో సినిమాకు ట్వీట్ చేస్తే.. ఎన్టీఆర్ అభిమానులకు కోపం రావడం ఏంటి అనే అనుమానాలు రావచ్చు. అసలు విషయం ఏమిటంటే మహేష్ బాబు.. తమ హీరో సినిమా గురించి ట్వీట్ చేయకుండా.. ఎక్కడో తమిళ హీరో సినిమాకి ట్వీట్ చేయడమే వారి కోపానికి కారణం.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ‘అరవింద సమేత’ చిత్రం టాలీవుడ్‌లో సంచలనాలను సృష్టించి భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. మేం గొప్ప స్నేహితులం అని చెప్పుకునే మహేష్.. తన మిత్రుడైన ఎన్టీఆర్ సినిమా గురించి ఒక్క ముక్క కూడా చెప్పకుండా.. పొరుగు హీరో సినిమాపై ప్రశంసలు కురిపించడం ఏమిటని ఎన్టీఆర్ అభిమానులు గరంగరం అవుతున్నారు. ఒక్క ఎన్టీఆర్ మాత్రమే కాదు, ‘అరవింద సమేత’ దర్శకుడు త్రివిక్రమ్ కూడా మహేష్‌కి చాలా మంచి స్నేహితుడు. రెండు సినిమాలు కూడా చేశాడు. ఇక ‘సర్కార్’ దర్శకుడు కూడా మహేష్‌తో ఓ సినిమా చేశాడు. ఈ లెక్కన చూసిన ముందు ప్రయారిటీ ‘అరవింద సమేత’కే ఇవ్వాలి. కానీ మహేష్ అలా చేయలేదు. అందుకే ఎన్టీఆర్ అభిమానులు సూపర్ స్టార్‌పై సీరియస్‌గా ఉన్నారు.