Advertisementt

‘2.O’ టీమ్‌కి ఇప్పుడు ఇదొక పెద్ద టెన్షన్!!

Sun 11th Nov 2018 12:16 PM
rajinikanth,shankar,2.0 movie,leaks  ‘2.O’ టీమ్‌కి ఇప్పుడు ఇదొక పెద్ద టెన్షన్!!
Tension in 2.O Film Makers ‘2.O’ టీమ్‌కి ఇప్పుడు ఇదొక పెద్ద టెన్షన్!!
Advertisement
Ads by CJ

ఇప్పుడు సోషల్ మీడియా, ఇంటర్నెట్ ఎంత వేగంగా అభివృద్ధి చెందిందో.. సినిమాల విషయంలో పైరసీ భూతం కూడా అంతే అభివృద్ధి చెందింది. చిన్న సినిమాల విషయంలో నిర్మాతల పరిస్థితి ఏమో కానీ... భారీ బడ్జెట్ సినిమాల విషయంలో పైరసీ భూతంగా నిర్మాతలు ఒణికి పోతున్నారు. అన్నిటికన్నా ఎక్కువగా సౌత్ లోనే ఈ పైరసీ భూతం బాగా పాతుకుపోయింది. తమిళనాట అయితే మరీను. స్టార్ హీరోలకు, భారీ నిర్మాతలకు ఈ పైరసీ భూతం ఛాలెంజ్ విసురుతుంది అంటేనే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్ధమవుతుంది. సినిమా ఇలా థియేటర్స్ లోకి వచ్చిందో లేదో.. అలా సినిమా పైరసీ భారిన పడుతుంది.

నిన్నగాక మొన్న తమిళంలో పందెంకోడి 2, సర్కార్ సినిమాలు విడుదలైన మూడు గంటల్లోనే పైరసీ అయ్యింది. సర్కార్ సినిమాను ఫస్ట్ షో ముగిసే సమయానికే తమ వెబ్‌సైట్లో రిలీజ్ చేసింది తమిళ్ రాకర్స్. ఈ పైరసీ వలన నిర్మాతలే కాదు.. సినిమా ఇండస్ట్రీ కూడా కొన్ని కోట్ల నష్టానికి గురవుతుంది. తాజాగా తమిళ్ రాకర్ విసిరిన సవాల్‌తో తమిళ ఫిల్మ్ ఇండస్ర్టీలో ఆందోళన మొదలైంది. రజనీకాంత్- శంకర్ కాంబోలో 600 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన 2.0 సినిమాని విడుదలైన కొద్దిసేపట్లోనే తాము విడుదల చేస్తామంటూ తమిళ రాకర్ ట్విట్టర్‌లో ఓ మెసేజ్ కనిపించింది. ఆ మెసేజ్ చూసిన 2.ఓ టీంకి టెంక్షన్ పట్టుకుంది. 

Tension in 2.O Film Makers:

2.0 Team Feared with Leaks

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ