మామూలు హీరోలతో మెయిన్ హీరోయిన్‌గా చేస్తే వచ్చే గుర్తింపు కంటే స్టార్స్ చిత్రాలలో అతిథిపాత్రలు, ఐటంనెంబర్స్ చేస్తే ఎక్కువ గుర్తింపు వస్తుందనేది వాస్తవం. దీనికి ఎందరో హీరోయిన్లను ఉదాహరణగా చెప్పాలి. ఇక ఇటీవలి ఓ చిత్రమే దానికి చక్కని ఉదాహరణగా చెప్పవచ్చు. ‘ముకుందా, ఒక లైలా కోసం, బాలీవుడ్‌లో హృతిక్‌రోషన్ సరసన మొహంజదారో’ వంటి చిత్రాలలో చేసినప్పటికీ పూజాహెగ్డేకి సరైన గుర్తింపురాలేదు. నిజానికి ఆతర్వాత ఆమె అల్లుఅర్జున్‌తో ‘దువ్వాడ జగన్నాథం’ వంటి చిత్రంతో కూడా రాని ఫేమ్ ‘రంగస్థలం’లో ఆమె చేసిన ఐటంసాంగ్ ‘జిగేల్‌రాణి’ ద్వారా లభించింది. వెనువెంటనే ఆమెకి వరుస అవకాశాలు వెత్తుకుంటూ వస్తున్నాయి. కాబట్టి నేటి రోజుల్లో ఐటం నెంబర్సే కదా! అని ఊరుకోకూడదు. ఒకప్పుడు వయసు మళ్లినవారు, అలాంటి పాటల కోసమే అన్నట్లు కొందరు ఉండేవారు. కానీ ప్రస్తుతం వీటికి గుర్తింపు బాగా పెరిగింది. తక్కువ కాల్షీట్స్, శ్రమతో భారీ పారితోషికాలు, ఫేమ్ రావడం ఐటం నెంబర్స్ ప్రత్యేకత. ఇక విషయానికి వస్తే రకుల్‌ప్రీత్‌సింగ్ ఇప్పటివరకు రామ్‌చరణ్ సరసన రెండు చిత్రాలలో హీరోయిన్‌గా నటించింది. ‘ధృవ, బ్రూస్‌లీ’ చిత్రాలలో ఆయనతో జతకట్టింది. అయినా ఆమెకంటూ ప్రత్యేక ప్రశంసలు మాత్రం దక్కలేదు. ఇలాంటి సమయంలోనే ప్రస్తుతం రామచరణ్ నటిస్తున్న చిత్రంలో ఆమెకి ఓ ఐటం సాంగ్‌లో అవకాశం వచ్చిందట. ప్రస్తుతం రామ్‌చరణ్, బోయపాటిశ్రీను దర్శకత్వంలో దానయ్య నిర్మాతగా ‘వినయ విధేయ రామా’ చేస్తున్నాడు. ఇంతకు ముందు బెల్లకొండ శ్రీనివాస్-బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన ‘జయజానకి నాయకా’, ‘సరైనోడు’ చిత్రాలలో కూడా రకులే హీరోయిన్. అలా ఈమె చరణ్‌కే కాదు బోయపాటికి కూడా మంచి సన్నిహితురాలు.
కానీ ఆమెని ఈ తాజా చిత్రంలో ఐటం సాంగ్ చేయమంటే ప్రస్తుతం తాను కోలీవుడ్‌లో బిజీగా ఉన్నానని నో చెప్పిందట. ఇక ఈమెకి ‘స్పైడర్’ తర్వాత తెలుగులో అవకాశాలు తగ్గిపోయాయి. దాంతో ఈమె కోలీవుడ్‌పై దృష్టి పెట్టింది. గతంలో చరణ్‌తో రెండు చిత్రాలలో మెయిన్ హీరోయిన్‌గా నటించిన తాను అదే హీరోతో ఐటం చేయడం ఇష్టం లేకనే ఆమె నో చెప్పిందని సమాచారం. నిజమే అయి ఉండవచ్చు గానీ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ వంటి వారితో కలిసి ‘జయజానకి నాయకా’ వంటి చిత్రాలలో చేసేకంటే ఇలాంటి చిత్రాలలో ఐటం చేసినా వచ్చేలాభాలు ఎక్కువనే విషయం పాపం... రకుల్ మర్చిపోయినట్లుంది.