మంచు హీరోలలో మంచు మనోజ్‌ది ప్రత్యేకశైలి. విభిన్ననటునిగానే కాదు... తనదైన బహుముఖ ప్రజ్ఞలను చాటాలని ఆయన ఆశపడుతూ ఉంటారు. ఇక విషయానికి వస్తే ఇటీవల పవన్‌కళ్యాణ్ ఆదేశానుసారం తిత్లీ తుపాన్ కారణంగా తీవ్రంగా నష్టపోయిన శ్రీకాకుళం జిల్లాలోని ఓ గ్రామాన్ని అబ్బాయ్ రామ్‌చరణ్ దత్తత తీసుకోవడానికి నిర్ణయించుకోవడంపై ప్రశంసల వర్షం కురిపించాడు. అంతేకాదు.. చరణ్‌కి ప్రేరణ ఇచ్చిన పవన్‌ని కూడా ఆకాశానికి ఎత్తేశాడు. ఇలా ఇతరులు మంచి పనిచేస్తూ ఉంటే తనదైన శైలిలో ఆయన ప్రోత్సాహం అందిస్తుండటంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
ఇక తాజాగా నందమూరి బాలకృష్ణ కుమార్తె, నారాలోకేష్ సతీమణి, సీఎం చంద్రబాబు నాయడు కోడలు నారా బ్రాహ్మణి శ్రీకాకుళంలోని ఏకంగా తొమ్మిది గ్రామాలను దత్తత తీసుకుంటానని ప్రకటించింది. దీనిపై మోహన్‌బాబు తనయుడు మంచు మనోజ్ ప్రశంసలు కురిపిస్తూ, బాలయ్య ఓ సింహం... ఆయన కూతురు బ్రాహ్మణి ఓ ఆడసింహం. తిత్లీ తుపాన్ కారణంగా అతలాకుతలమైన శ్రీకాళం జిల్లాలోని తొమ్మిది గ్రామాలను బ్రాహ్మణి దత్తత తీసుకోవడం గొప్ప విషయం. ఆమె దృఢచిత్తానికి ఇది నిదర్శనం. నాకు తెలిసిన దృఢమైన మహిళల్లో ఆమె ఒకరు. ఆమె స్ఫూర్తిదాయకమైన చర్యలకు నేను అభినందనలు తెలియజేస్తున్నానని.. ఆయన ట్విట్టర్ వేదికగా తెలియజేశాడు.