Advertisementt

ఏంటి చరణ్ చేస్తుంది ఆ సినిమా రీమేకా?

Thu 25th Oct 2018 03:22 PM
ram charan,boyapati,new movie,story,leake  ఏంటి చరణ్ చేస్తుంది ఆ సినిమా రీమేకా?
Charan And Boyapati Story Leaked ఏంటి చరణ్ చేస్తుంది ఆ సినిమా రీమేకా?
Advertisement
Ads by CJ

రామ్ చరణ్ - బోయపాటి కాంబినేషన్ లో ఓ యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. దీనికి 'విన‌య విధేయ రామ‌' అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్టు సమాచారం. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా యొక్క ఫస్ట్ లుక్ దీపావళి రోజు విడుదల అవుతుందని యూనిట్ సభ్యులు చెబుతున్నారు. ఈ నేపధ్యంలో ఈ మూవీ స్టోరీ బయటికి వచ్చింది. అచ్చం చిరంజీవి 'గ్యాంగ్ లీడర్' సినిమా స్టోరీలా ఉంది.

'గ్యాంగ్ లీడర్' స్టోరీ మీకు గుర్తుంటే.. మీకే అర్ధం అవుతుంది. 'గ్యాంగ్ లీడర్' ముగ్గురు అన్న‌ద‌మ్ముల క‌థ. పెద్దోడిగా ముర‌ళీ మోహ‌న్‌.. చిన్నోడిగా చిరంజీవి నటించారు. ముర‌ళీ మోహ‌న్‌ ని కొన్ని కారణాల వల్ల విల‌న్ చంపేస్తాడు. ఆ విషయం చిరంజీవికి తెలియదు. తన స్నేహితులకు తెలిసిన చిరంజీవికి చెప్పకుండా దాస్తారు. మరి చిరంజీవికి ఎలా తెలుస్తుంది..తెలిసి ఏం చేశాడు అనేది మిగతా కథ. 

సేమ్ టూ సేమ్ అటువంటి కథనే బోయపాటి, చరణ్ ను పెట్టి సినిమా తీస్తున్నారు. ఇందులో అన్న‌య్య (ప్ర‌శాంత్‌)ని విల‌న్ గ్యాంగ్ దారుణంగా చంపేస్తుంద‌ని, ఈ విషయం తెలిసిన చిన్న‌న్న‌య్య (ఆర్య‌న్ రాజేష్‌) తన తమ్ముడైన చరణ్ కు చెప్పడు. చివ‌రికి విష‌యం తెలుసుకున్న చరణ్ శ‌త్రువుల‌పై ఎలా ప‌గ తీర్చుకున్నాడ‌న్న‌దే ఈ సినిమా క‌థ అని స‌మాచారం. అప్పటిలో 'గ్యాంగ్ లీడర్' సినిమా సూపర్ హిట్ అయింది. ఈ సినిమాను రీమేక్ చేస్తే బాగుండదని  చరణ్ చాలా సందర్భాల్లో చెప్పాడు. మరి ఈ సినిమాతో ఆ కోరిక తీరబోతుందా??

Charan And Boyapati Story Leaked:

Rumours on Charan and Boyapati Film Story

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ