Advertisementt

మా నాన్నకు అలాంటి అలవాట్లు లేవ్: ఐశ్వర్య

Wed 24th Oct 2018 06:32 PM
aishwarya arjun,metoo,arjun sarja,shrutihariharan,allegations  మా నాన్నకు అలాంటి అలవాట్లు లేవ్: ఐశ్వర్య
MeToo: Family Support to Action King Arjun మా నాన్నకు అలాంటి అలవాట్లు లేవ్: ఐశ్వర్య
Advertisement
Ads by CJ

 

ఇటీవల కంగనా రౌనత్‌ 'క్వీన్‌' దర్శకుడిపై లైంగిక వేధింపులు, అసభ్యప్రవర్తనపై ఆరోపణలు చేసినప్పుడు ఆయన మాజీ భార్య కూడా కంగనా తీరుని తప్పుపట్టి, ఆమె వ్యక్తిత్వంలోనే లోపాలు ఉన్నాయని, ఇన్ని వేధింపులు చేసిన వ్యక్తిపై అంతకాలం ఎలా స్నేహం చేశావు? డిన్నర్లకు ఎలా వెళ్లావు? తన మాజీ భర్త తీయదలచిన సినిమాలో నటించేందుకు ఎలా ఒప్పుకున్నావు? అని కౌంటర్‌ ఇచ్చింది. నిజానికి ఈ 'మీటూ' ఉద్యమం లక్ష్యం మంచిదే అయినా దానిని వాడుకుంటున్న తీరుపై మాత్రం పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వీటివల్ల నిజాయితీ కలిగిన ప్రముఖుల పేర్లు కూడా డ్యామేజీ అవుతాయని, వారి సంసార జీవితంపై కూడా అవి పెను ప్రభావం చూపుతాయని అంటున్నారు. ఇక ఇటీవల యాక్షన్‌కింగ్‌ అర్జున్‌పై నటి శృతిహరిహరన్‌ ఓ చిత్రం షూటింగ్‌లో తనతో అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపణలు చేసింది. అర్జున్‌కి నిజజీవితంలో కూడా జెంటిల్‌మేన్‌గా పేరుంది. దేశభక్తి, సామాజిక బాధ్యత కలిగిన ఈయనకు హీరోయిన్‌ అయిన కూతురు ఐశ్వర్య కూడా ఉంది. 

ఇటీవలే తన తండ్రికి ఆమె ఓ గోవుని బహుమతిగా ఇచ్చింది. ఇక విషయానికి వస్తే శృతి చేసిన ఆరోపణలను అర్జున్‌ ఫ్యామిలీ కొట్టిపడేసి ఆయనకు మద్దతుగా నిలిచింది. ఐశ్వర్య మాట్లాడుతూ, ఈ చిత్రం స్క్రిప్ట్‌లో రెండు అభ్యంతరకరమైన సీన్స్‌ ఉంటే వాటిని తొలగిస్తేనే తాను నటిస్తానని నాతండ్రి పట్టుబట్టి వాటిని తీయించాడు. తాను నటించే స్క్రిప్ట్‌లను మా ఇంట్లోని అందరినీ కూడా వినమని మా నాన్న చెబుతాడు. దాని వల్ల అసభ్యకరమైన సీన్స్‌ ఉంటే సలహా తీసుకోవచ్చని మా నాన్న ఉద్దేశ్యం. 

సినిమా షూటింగ్‌లో శృతి ఐదు రోజులు మాత్రమే పాల్గొంది. రిసార్ట్‌కి, డిన్నర్లలకు రావాల్సిందిగా మా నాన్న శృతిని వేధించాడనేది అబద్దం. ఇన్నేళ్ల నా జీవితంలో మా నాన్న పబ్‌కి వెళ్లడం నేను ఇప్పటి వరకు చూడలేదు. అలాంటిది నా తండ్రిపై శృతి చేసిన ఆరోపణలను ఎవ్వరూ నమ్మరు. శృతి హరిహరన్‌ కేవలం సొంత ప్రయోజనాల కోసమే మా నాన్నని టార్గెట్‌ చేస్తోందని మండిపడింది. ఇక ఈ ఆరోపణలపై తాను చట్టప్రకారం చర్యలు తీసుకుంటానని అర్జున్‌ ఇప్పటికే వెల్లడించిన విషయం తెలిసిందే. 

MeToo: Family Support to Action King Arjun:

Aishwarya Arjun Talks About Metoo Allegations on Her Father 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ