Advertisementt

బాలయ్య స్పీచ్‌పై సెటైర్లే సెటైర్లు..!!

Wed 24th Oct 2018 01:26 PM
balakrishna,pooja hegde,hindi language,aravinda sametha,success meet  బాలయ్య స్పీచ్‌పై సెటైర్లే సెటైర్లు..!!
Satires on Balakrishna Speech at Aravinda Sametha Success meet బాలయ్య స్పీచ్‌పై సెటైర్లే సెటైర్లు..!!
Advertisement
Ads by CJ

నాటి స్వర్గీయ ఎన్టీఆర్‌ అద్భుతమైన ప్రసంగీకుడు. తన మాటల చాతుర్యానికి పిట్టకథలు, వ్యంగాస్త్రాలు, ప్రతి పక్షాలపై పదునైన విమర్శలు, తన పాలనను, తాను ప్రవేశపెట్టిన సంస్కరణలను గూర్చి ఆయన రాజకీయ వేదికలపై మాట్లాడుతూ ఉంటే ఆయన ప్రసంగాలకు జనాలు ఉర్రూతలూగేవారు. ఆయన ఉపన్యాసం విన్న వారు ఇక ఆయనకు అభిమానులు కావడమే కాదు.. ఆయనకే ఓటేసేటట్లు చేయగలిగిన మాటల చాతుర్యం, నేర్పరితనం, స్పురధ్రూప్తి, ఆజానుబాహుడిగా గంభీరమైన ఆయన కంఠస్వరం అనేవి అద్భుతం.. అనితర సాధ్యం. ఇక సినిమాలలో పేజీలకు పేజీలు ఉండే సంస్కృత డైలాగులు, పౌరాణిక సంభాషణలతో పాటు అన్ని రకాల సంభాషణలను ఆయన తెరపై చెప్పే తీరు వీనుల విందుగా ఉండి.. పౌరాణిక డైలాగ్‌లు సామాన్య మాస్‌ ప్రేక్షకులకు అర్ధం కాకపోయినా ఆయన చెప్పే తీరుకి చప్పట్లతో థియేటర్లు మారుమోగిపోయేవి. 

ఇక తండ్రి వారసత్వం నటనలో కాస్త అంతో ఇంతో బాలకృష్ణకి మాత్రమే వచ్చింది. ఆయన సినిమాలలో అద్భుతమైన, పవర్‌ఫుల్‌ డైలాగ్‌లను ఎంతో సూపర్బ్‌గా చెబుతారు. కానీ బయట ప్రసంగాలలో మాత్రం ఆయన మాటతీరు సరిగా ఉండదు. ఎవరికైనా ఏమైనా బలహీనతలు ఉంటే వాటిని హోంవర్క్‌ అవసరం. పివి నరసింహారావు, వాజ్‌పేయ్‌ వంటి వారు కూడా ఏదైనా మాట్లాడాలంటే ముందుగా దానికి కొంత హోంవర్క్‌ చేసుకునేవారు. వెంకయ్య నాయుడు వంటి గొప్ప వక్త దేశంలోనే లేడు. కానీ ఆ పట్టు కోసం ఆయన పడిన కష్టం అందరికీ తెలుసు. కానీ బాలయ్య ఈ విషయంలో మాత్రం రోజు రోజుకి దిగదుడుపుగా మారిపోతున్నాడు. నందమూరి కుటుంబంలో స్వర్గీయ ఎన్టీఆర్‌ మాటల చాతుర్యం అంతో ఇంతో పురందరేశ్వరికి, జూనియర్‌ ఎన్టీఆర్‌కి మాత్రమే వచ్చాయి. ఇక బాలయ్య చేసే ప్రసంగాలలో మాటల కూర్పు ఎంతో దీనంగా ఉంటుంది. ఎక్కడో ప్రారంభించి, ఏదేదో చెప్పాలనే తాపత్రయంతో అర్ధం కాని విధంగా మాట్లాడి నవ్వుల పాలవుతూ ఉంటాడు. 

ఇక తాజాగా జరిగిన 'అరవింద సమేత వీరరాఘవ' సక్సెస్‌ మీట్‌లో కూడా బాలయ్య పూజాహెగ్డేని మెచ్చుకుంటూ చూపిన హిందీ పై తీవ్ర సెటైర్లు వస్తున్నాయి. 'లగ్తాహై ఆస్మాన్‌ సే ఫరిస్తా ఉతర్‌ కే సంగ్‌ మే మరమరాన్‌ మే బనాలేంగే.. హర్‌ ఖలీ మస్తే... పత్తీ పత్తీ గులాబ్‌ హోజాతీ హై' అని పూజాహెగ్డే అందాన్ని వర్ణిస్తూ బాలయ్య హిందీలో బోలాడు. దీంతో ఆయన ఏం మాట్లాడాడో.. దానికి అర్ధం ఏమిటో అర్ధం కాలేదంటూ కొందరు నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. 'ఈ భాషాకో తెల్గూమే బోలే మేధావుల్‌ హైతే.. నాకు సమఝ్‌ అయేలా బోలండీ ప్లీజ్‌.. అమ్మాయిలను పడేయాలంటే బాలయ్య వద్దకు ట్యూషన్‌కి వెళ్లాల్సిందే అని మరికొందరు.. బాలయ్య డైలాగ్స్‌పై జోక్‌లు పేలుస్తూ, బాలయ్య మాట్లాడిన వీడియో ప్రసంగాన్ని జత చేసి వైరల్‌ చేస్తున్నారు. బాలయ్య.. ఇదేం భాష గోలయ్యా...! 

Satires on Balakrishna Speech at Aravinda Sametha Success meet:

Balakrishna praises Pooja Hegde in Hindi Language

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ