Advertisementt

అఖిల్ 4వ మూవీ లైన్‌లో పెట్టినట్లేనా?

Thu 18th Oct 2018 02:06 PM
akhil akkineni,4th film,boyapati srinu,venky atluri  అఖిల్ 4వ మూవీ లైన్‌లో పెట్టినట్లేనా?
Akhil Akkineni 4th Movie Details అఖిల్ 4వ మూవీ లైన్‌లో పెట్టినట్లేనా?
Advertisement
Ads by CJ

యంగ్ హీరో అక్కినేని అఖిల్.. తెలుగు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకునేందుకు చాలానే కష్టపడుతున్నాడు. నాగార్జున సలహాలు తీసుకుని అయన గైడెన్స్ లో నడుస్తున్నాడు. ఇప్పటి వరకు చేసిన సినిమాలతో సరైన హిట్‌ని అందుకోలేకపోయిన అఖిల్.. ఈసారి ఆ తప్పు జరగకూడని నిర్ణయించుకుని హిట్ డైరెక్టర్ వెంకీ అట్లూరి డైరెక్షన్ లో ‘మిస్టర్ మజ్ను’ సినిమా చేస్తున్నాడు.

‘తొలిప్రేమ’ లాంటి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ అందించిన వెంకీ ఈసారి కూడా ఓ డిఫరెంట్ లవ్ స్టోరీతో అఖిల్ ను డైరెక్ట్ చేస్తున్నాడు. రీసెంట్ గా రిలీజ్ అయిన ‘మిస్టర్ మజ్ను’ ఫస్ట్ లుక్ టీజర్ తో ప్రేక్షకులని బాగానే ఆకట్టుకున్నాడు అఖిల్. దాదాపు 70 శాతం షూటింగ్ కంప్లీట్ అయిన ఈసినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో రిలీజ్ అవ్వనుంది. మరి ఈసినిమా తర్వాత అఖిల్ ఏ డైరెక్టర్ తో సినిమా చేయనున్నాడనే విషయంపై ప్రస్తుతం చర్చ నడుస్తుంది.

అందుకుగాను తెరపైకి బోయపాటి పేరు వచ్చింది. ప్రస్తుతం బోయపాటి రామ్ చరణ్ తో ఓ సినిమా చేస్తున్నాడు. ఇది చివరి దశలో ఉంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ అవుతున్న ఈచిత్రం తర్వాత బోయపాటి బాలకృష్ణ తో ఓ సినిమా చేయనున్నాడు. ఈసినిమా పూర్తి అవ్వగానే అఖిల్ తో సినిమా చేయనున్నాడని తెలుస్తుంది. మరి అఖిల్.. బాలకృష్ణ సినిమా అయ్యేవరకు వెయిట్ చేస్తాడా? అన్న విషయం తెలియాలి. నాగార్జున కోరిక మేరకు బోయపాటి అఖిల్ కు కథను సిద్ధం చేస్తున్నాడని అంటున్నారు. పక్కా యాక్షన్ ఎంటర్టైనర్‌గా ఈ సినిమా రూపొందనుందని చెబుతున్నారు.

Akhil Akkineni 4th Movie Details:

Akkineni Akhil 4th movie in Boyapati Srinu Direction

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ