వరుస విజయాలతో నేటి యంగ్‌స్టార్స్‌కి గుండెల్లో దడ పుట్టిస్తున్న సెన్సేషనల్ స్టార్ విజయ్‌దేవరకొండ. ‘పెళ్లిచూపులు, అర్జున్‌రెడ్డి, మహానటి, గీతాగోవిందం’ చిత్రాలతో అద్భుతంగా దూసుకొచ్చాడు. ఏకంగా అతి తక్కువ చిత్రాలతోనే 100కోట్ల క్లబ్‌లో చేరాడు. చిరు చేత మరో స్టార్ ఇండస్ట్రీకి లభించాడనే ప్రశంసల పొందాడు. అల్లుఅరవింద్ ఏకంగా విజయ్‌ని చిరుతో పోల్చాడు. కానీ ఎన్నో అంచనాల మద్య వచ్చిన ‘నోటా’ మాత్రం దారుణ ఫలితాలను మూటగట్టుకుంది. ఇక దీని కంటే ముందే ఆయన నటించిన ‘ట్యాక్సీవాలా’ చిత్రం విడుదల కావాల్సి ఉంది. ఈ నేపధ్యంలో ‘ట్యాక్సీవాలా’ ఫలితం విజయ్‌కి కీలకంగా మారింది.
ఇక ‘నోటా’ చిత్రం ఫ్లాప్ అయి ఉండవచ్చు గానీ విజయ్ మాత్రం నటునిగా తన వంతు ప్రయత్నం చేశాడు. ఇక తాజాగా ‘నోటా’ చిత్ర దర్శకుడు, తమిళ డైర్టెర్ ఆనంద్ శంకర్ మాట్లాడుతూ, ఈ చిత్రం కోసం ఎంతో నైపుణ్యం ఉన్న విజయ్‌తో పనిచేయడం ఆనందంగా ఉంది. ఆయన నటించినవి కొన్నిచిత్రాలే అయినా ఎంతో అనుభవం ఉన్న వాడిలా నటిస్తాడు. ‘నోటా’ రివ్వ్యూలలో విజయ్ ముఖ్యమంత్రిగా నటించడం గురించి ఎక్కడా ప్రతికూల వ్యాఖ్యలు చూడలేదు. ఈ సినిమాలో హీరో, భయంకరమైన విలన్ ఉండరు.విజయ్‌కి ప్రేక్షకుల్లో ఓ ఇమేజ్ ఉంది.
ఈ చిత్రంలో ఆయనను నిజాయితీగా చూపించుకోదలుచుకోలేదు. నిజజీవితంలోలాగానే ఈ చిత్రంలో నెగటివ్ పాత్రలు కూడా ఉంటాయి.కాబట్టి ఈ పాత్రను హీరో అనలేం. ఆశించిన దాని కంటే బాగా చేస్తున్నప్పుడు వారితో నటించడం ఎంతో సౌకర్యంగా ఉంటుంది. విజయ్‌ని డైరెక్ట్ చేయడం నిజంగా ఎంతో గొప్ప అనుభవం. కొన్ని చిత్రాల అనుభవమే ఉన్న ఆయన సీన్స్‌ని అర్ధం చేసుకునే తీరు ప్రత్యేకంగా ఉంటుంది. అతని నటన, లుక్స్ ప్రత్యేకమైన కాంబినేషన్. విజయ్ గొప్పనటుడు, గొప్ప వ్యక్తి కూడా. అన్ని సానుకూలంగా జరిగితే ఆయన ఇంకా పెద్ద స్టార్ అవుతాడు.ఎప్పటికీ చిత్ర పరిశ్రమలో నిలిచిపోతాడు.. అంటూ విజయ్‌కి ఆనంద్‌శంకర్ కితాబునిచ్చాడు.