Advertisementt

‘ఎన్టీఆర్’లో విజయ్ దేవరకొండ రోల్ ఏంటో తెలుసా?

Thu 04th Oct 2018 10:22 PM
  ‘ఎన్టీఆర్’లో విజయ్ దేవరకొండ రోల్ ఏంటో తెలుసా?
Vijay Deverakonda in NTR Biopic ‘ఎన్టీఆర్’లో విజయ్ దేవరకొండ రోల్ ఏంటో తెలుసా?
Advertisement
Ads by CJ

మహానటి లో ఫోటో జర్నలిస్ట్‌గా.. జర్నలిస్ట్ మధురవాణి అయిన సమంత ని ప్రేమించే పాత్రలో విజయ్ ఆంటోనిగా విజయ్ దేవరకొండ పాత్రని దర్శకుడు నాగ్ అశ్విన్ బాగా డిజైన్ చేసాడు. మహానటిలో సమంత చుట్టూ తిరుగుతూ లవ్ ప్రపోజ్ చెయ్యాలనే ఆరాటంలో ఉంటాడు విజయ్ దేవరకొండ. మరి మహానటి అనుకోకుండా బ్లాక్ బస్టర్ అవడం అందులో విజయ్ దేవరకొండ భాగస్వామి అవడం జరిగింది. ఇక తాజాగా నోటా అనే పొలిటికల్ బ్యాగ్ డ్రాప్ మూవీతో తెలుగు, తమిళ ప్రేక్షకులను అలరించబోతున్న విజయ్ దేవరకొండ.. మరో బిగ్ ప్రాజెక్ట్ లో పొలిటికల్ లీడర్ పాత్ర చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడనేది లేటెస్ట్ న్యూస్.

క్రిష్ దర్శకత్వంలో బాలకృష్ణ ఎన్టీఆర్ పాత్రలో, రానా చంద్రబాబుగా, ఏఎన్నార్ గా సుమంత్, శ్రీదేవి గా రకుల్ ప్రీత్ నటించబోతున్న మహానటుడు ఎన్టీఆర్ బయోపిక్ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. అయితే ఈ సినిమాకోసం దర్శకుడు క్రిష్ మంచి క్రేజ్ లో ఉన్న నటీనటులను ఎన్టీఆర్ బయోపిక్ కోసం సెలెక్ట్ చేసుకుంటున్నాడు. ఎన్టీఆర్ నట జీవితంలోను, రాజకీయం గాను ఎంతో పలుకుబడి ఉన్న వ్యక్తి కావడం... వలన ఆయనతో సన్నిహితంగా ఉన్న వారిని ఎన్టీఆర్ బయోపిక్ లో భాగం చేస్తున్నారు. తాజాగా ఎన్టీఆర్ బయోపిక్ లో విజయ్ దేవరకొండ వన్ అఫ్ ద టాప్ కేరెక్టర్ ప్లే చేయబోతున్నాడనే టాక్ వినబడుతుంది.

అది కూడా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పాత్రలో కనిపంచబోతున్నాడనేది తాజా సమాచారం. ఎన్టీఆర్ టీడీపీలో కేసీఆర్ అప్పట్లో మంత్రిగా పనిచేశారు. అలాగే ఎన్టీఆర్ అంటే కేసీఆర్ కి ప్రాణం. అంత అభిమానం ఎన్టీఆర్ మీద కేసీఆర్ కి ఉండేది. ఇక కేసీఆర్ రాజకీయ జీవితానికి పునాది వేసింది ఎన్టీఆరే. అందుకే ఈ చిత్రంలో కేసీఆర్ ని చూపిస్తున్నారంటున్నారు. ఇక ఈ పాత్రకి ప్రస్తుతం నోటాతో రాజకీయం నేపథ్యం ఉన్న సినిమాలో నటించడం, అలాగే విజయ్ ఎలాగూ తెలంగాణ హీరో కావడంతో.. కేసీఆర్ పాత్రకు విజయ్ అయితే బాగుంటాడని దర్శకనిర్మాతలు బావిస్తున్నారట. మరి ఈ పాత్రకి విజయ్ సై అంటాడా లేదో తెలియదు కానీ... ఎన్టీఆర్ బయోపిక్ ని రెండు భాగాలుగా తీస్తున్నారని.. అది కూడా రెండు వారాల గ్యాప్ లో రెండు భాగాలూ విడుదలవుతాయంటూ.. ఫిలింసర్కిల్స్‌లో ఒక న్యూస్ వీర విహారం చేస్తుంది.

Vijay Deverakonda in NTR Biopic:

Vijay Deverakonda plays KCR Role in NTR biopic

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ