Advertisementt

‘2 ఫ్రెండ్స్’.. ట్రూ హిట్టవ్వాలి: కె. రోశయ్య

Sun 30th Sep 2018 04:58 PM
2 friends,k rosaiah,trailer launch,anantharamudu producer,c kalyan  ‘2 ఫ్రెండ్స్’.. ట్రూ హిట్టవ్వాలి: కె. రోశయ్య
K Rosaiah launches 2 Friends Movie trailer ‘2 ఫ్రెండ్స్’.. ట్రూ హిట్టవ్వాలి: కె. రోశయ్య
Advertisement
Ads by CJ

అనంతలక్ష్మి క్రియేషన్స్ పతాకంపై.. ముళ్లగూరు లక్ష్మీదేవి సమర్పణలో.. ముళ్లగూరు అనంతరాముడు-ముళ్లగూరు రమేష్ నాయుడు తెలుగు-కన్నడ భాషల్లో సంయుక్తంగా నిర్మించిన సినిమా ‘2 ఫ్రెండ్స్’. ట్రూ లవ్.. అనేది ట్యాగ్ లైన్. సూరజ్, అఖిల్ కార్తిక్, సోనియా, ఫర హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి శ్రీనివాస్ జి.ఎల్.బి దర్శకుడు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్నఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్ ను హైద్రాబాద్ ప్రసాద్ ల్యాబ్ లో ఘనంగా జరిగిన కార్యక్రమంలో అవిభక్త ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ డాక్టర్ కొణిజేటి రోశయ్య విడుదల చేశారు. అన్ని రంగాల్లో అసాధారణ విజయాలు సాధిస్తున్న అనంత రాముడు సినిమా రంగంలోనూ అద్భుతాలు సృష్టించాలని ఆయన  ఆకాంక్షించారు. ‘ట్రూ లవ్’ అనే ట్యాగ్ లైన్ తో రూపొందిన  ‘2 ఫ్రెండ్స్’  ట్రూ సక్సెస్ సాధించాలని అభిలషించారు. ఈ కార్యక్రమంలో  ప్రముఖ నిర్మాతలు  సి.కళ్యాణ్, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, వల్లూరిపల్లి రమేష్, ప్రముఖ దర్శకులు బి.గోపాల్, మారుతి, సురేష్ కొండేటి, నారపురెడ్డి తదితరులు పాల్గొన్నారు. తాను నిర్మాతనయ్యేందుకు కారకులైన నారపురెడ్డి మిత్రులు ముళ్లగూరు అనంతరాముడుగారు నిర్మాతగా శ్రీనివాస్ జి.ఎల్.బి దర్శకత్వంలో రూపొందిన ‘2 ఫ్రెండ్స్’ ఘన విజయం సాధించాలని సి.కళ్యాణ్ కోరుకున్నారు. 

నిర్మాత ముళ్లగూరు అనంతరాముడు మాట్లాడుతూ.. ‘‘విద్య, వ్యవసాయం, స్థిరాస్తి, ఫైనాన్స్ వంటి పలు రంగాల్లో విజయాలు సాధించిన తనకు.. సినిమా రంగంలోనూ విజయం సాధిస్తాననే నమ్మకం ఉందన్నారు. ముఖ్యమంత్రి హోదాలో తమ అనంతలక్ష్మి ఇంజినీరింగ్ కాలేజీకి వచ్చి ఆశీస్సులు అందించిన రోశయ్య గారు.. ‘2 ఫ్రెండ్స్’ థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేయడం సంతోషంగా ఉందని అన్నారు.  సినిమా రంగం మోసపూరితమైనదని అందరూ తనను భయపెట్టారని.. కానీ తనకు ఎటువంటి చేదు అనుభవాలు ఎదురు కాలేదని, భవిష్యత్తులో మరిన్ని మంచి సినిమాలు తీస్తానని అన్నారు. ఈ చిత్రం విడుదలకు సహకరిస్తున్న ప్రముఖ నిర్మాతలు సి.కళ్యాణ్, తుమ్మలపల్లి రామ సత్యనారాయణలకు కృతజ్ఞతలు తెలిపారు.

ప్రముఖ యువ దర్శకుడు మారుతి మాట్లాడుతూ.. తన కెరీర్ కూడా ఒక చిన్న సినిమాతోనే మొదలయిందని, అనంతరాముడుగారు భవిష్యత్తులో ఎన్నో పెద్ద సినిమాలు తీయాలని అన్నారు. బి.గోపాల్ చిత్ర యూనిట్ కి ఆల్ ది బెస్ట్ చెప్పారు. 

తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ.. అనంతరాముడుగారు వంటి గట్స్ ఉన్న నిర్మాతల అవసరం ఇండస్ట్రీకి ఉందన్నారు. ఈ సినిమా చూశానని, దర్శకుడు శ్రీనివాస్ సినిమాను అద్భుతంగా తీర్చి దిద్దారని.. 2 ఫ్రెండ్స్ చిత్రాన్ని రెండు రాష్ట్రాల్లో రెండు వందలకు పైగా ధియేటర్స్ లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని అన్నారు. దర్శకుడు శ్రీనివాస్ జి.ఎల్.బి మాట్లాడుతూ.. ఖర్చుకు వెనకాడకుండా నిర్మాతలు అందించిన సహాయ సహకారాల వల్ల సినిమా చాలా బాగా వచ్చింది.. అన్నారు.

K Rosaiah launches 2 Friends Movie trailer:

2 Friends Movie trailer Launch Event Highlights

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ