దిల్ రాజు చేయి పడితే కానీ హిట్ రాదనీ భ్రమలో ఉంది తెలుగు ఇండస్ట్రీ. ప్రస్తుతం చాలా మంది యంగ్ హీరోస్ వరసగా ప్లాప్స్ లో ఉన్నారు. అయితే వాళ్లు దిల్ రాజు బ్యానర్ లో ఓ సినిమా చేస్తే ఖచ్చితంగా హిట్ వస్తుందని భావిస్తున్నారు. ముఖ్యంగా నితిన్, రామ్. వీళ్లిద్దరు ఈమధ్య సొంత బ్యానర్ లోనే సినిమాలు చేస్తున్నారు.
అయితే వీళ్లిద్దరికీ హిట్ రాకపోవడంతో... దిల్ రాజు పారితోషికం తక్కువ ఇచ్చినా సరే దిల్ రాజుతోనే పని చేస్తామని అంటున్నారు. నితిన్ అయితే 'లై', 'ఛల్ మోహన్ రంగ' తర్వాత దిల్ రాజుతోనే మళ్లీ తన కెరియర్ నిలబడుతుందని నమ్ముతున్నాడు. నితిన్ ప్రస్తుతం చేసే 'శ్రీనివాస కళ్యాణం' చిత్రంతో తన ప్లాప్స్ కి బ్రేక్ పడుతుంది అనుకుంటున్నాడు.
అలానే రామ్ కి 'నేను శైలజ' తర్వాత హిట్టు లేదు. ప్రస్తుతం తాను దిల్ రాజు బ్యానర్ లో చేసే 'హలో గురూ ప్రేమకోసమే'తో ట్రాక్‌లో పడతానని నమ్ముతున్నాడు. మరో యువ హీరో రాజ్ తరుణ్ కూడా అంతే. అతను ఈమధ్య ఏ సినిమా చేసిన అవి బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. దాంతో అతని మార్కెట్ పూర్తిగా పోగొట్టుకున్నాడు. ఇప్పుడు 'లవర్'తో కం బ్యాక్ అవుతాడని ఆశిస్తున్నాడు. ఈ ముగ్గురు యంగ్ హీరోస్ జాతకాలు ఇప్పుడు దిల్ రాజు చేతిలో వున్నాయి. మరి ఏం అవుతుందో చూడాలి.