Advertisementt

దువ్వాడ దున్నేస్తున్నాడు..!

Mon 08th May 2017 08:33 PM
dj movie,duvvada jagannadham,allu arjun,pooja hegde,dj new poster,allu arjun with pooja hegde romantic poster  దువ్వాడ దున్నేస్తున్నాడు..!
DJ Movie New Poster Released దువ్వాడ దున్నేస్తున్నాడు..!
Advertisement
Ads by CJ

అల్లు అర్జున్ - హరీష్ శంకర్ కాంబినేషన్ లో 'డీజే.... దువ్వాడ జగన్నాథం' చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ చిత్ర ఫస్ట్ లుక్ లో బ్రాహ్మణుడి గెటప్ లో అల్లు అర్జున్ చూడ ముచ్చటిగా అదరగొట్టాడు. ఫస్ట్ లుక్ టీజర్ లోను మంత్రాలూ వల్లిస్తూ చేసిన యాక్షన్ సీన్స్  ఆదరాహో అనిపించినా.... బన్నీ సెకండ్ లుక్ లో స్టైలిష్ గా సూట్ కేస్ తో కనబడి సూపర్ అనిపించాడు. ఇక ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్న పూజ హెగ్డే కూడా 'డీజే' టీజర్ లో చాలా అందంగా గ్లామర్ గా అలరించింది. ఈ చిత్రాన్ని మొదట మే నెలలో విడుదల చెయ్యాలని మేకర్స్ భావించినప్పటికీ కొన్ని కారణాల వల్ల అది కాస్తా జూన్ 23కి వాయిదా పడింది.

ఇక డీజే చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా అదరగొట్టే రేంజ్ లో జరుగుతుందని బాలీవుడ్ డబ్బింగ్ రైట్స్, శాటిలైట్ రైట్స్ చూస్తుంటే అర్ధమవుతుంది. మరి భారీ అంచనాలకు చేరువవుతున్న డీజే లుక్ ఒకదాన్ని చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఆ లుక్ లో అల్లు అర్జున్, పూజ హెగ్డేల రొమాంటిక్ యాంగిల్ అదిరిందనే చెప్పాలి. మరి బన్నీ బ్రాహ్మణుడిగా కనిపిస్తూనే ఇప్పుడు రొమాంటిక్ యాంగిల్ కి యూటర్న్ తీసుకున్నాడా.... అనిపించేలా ఉందా ఫోజు చూస్తుంటే. మొత్తం మీదా 'డీజే... దువ్వాడ జగన్నాథం'లో బన్నీ వెరైటీ వెరైటీగా గా అదరగొట్టేస్తాడని మాత్రం అర్ధమవుతుంది. 

DJ Movie New Poster Released:

'Dj - Duvvada Jagannadham' turned too romantic. The new poster of the film has been released just a while ago. Both Stylish Star Allu Arjun and gorgeous beauty Pooja Hegde were seen in romantic mood and their chemistry appeared to have worked out well in the film.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ