Advertisement

నాగ్‌కు ఉన్న క్రేజ్‌ అలాంటిది మరి..!

Wed 30th Nov 2016 01:41 PM
nagarjuna,ragugari gadhi2,seerat kapoor,young heroines  నాగ్‌కు ఉన్న క్రేజ్‌ అలాంటిది మరి..!
నాగ్‌కు ఉన్న క్రేజ్‌ అలాంటిది మరి..!
Advertisement

లేడీస్‌ ఫాలోయింగ్‌లో నిన్నమొన్నటివరకు అదరగొట్టి టాలీవుడ్‌ మన్మథునిగా, 'గ్రీకువీరుడు'గా క్రేజ్‌ తెచ్చుకున్న నాగ్‌ది డిఫరెంట్‌ స్టైల్‌. ఆయన కోరితే ఆయన చిత్రంలో డ్యాన్స్‌ మాత్రమే వేయడానికైనా, గెస్ట్‌రోల్‌ అయినా ఐశ్వర్యారాయ్‌ నుండి అనుష్క, రమ్యకృష్ణ, నయనతార వరకు అందరూ ఒప్పుకుంటారు. సీనియర్‌స్టార్స్‌ అయిన చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్‌లను వెంటాడుతున్న హీరోయిన్ల సమస్య నాగ్‌కు మాత్రం లేదనే చెప్పాలి. ఆయనతో చేయడానికి ఇప్పటికీ కుర్రహీరోయిన్ల నుండి అనసూయ వరకు ఎదురుచూస్తుంటారు. చిరంజీవి వంటి మెగాస్టార్‌ 150వ ప్రతిష్టాత్మక చిత్రంలో ఆయన పక్కన నటించడానికి నిరాకరించిన అనుష్క, నయనతారలు నాగ్‌ అంటే మాత్రం ఓకే అంటారు. ఇదే ఆయనకున్న ఇమేజ్‌కు నిదర్శనం. కానీ ప్రస్తుతం తన వయసుకు తగ్గ వైవిధ్యమైన పాత్రలు మాత్రమే ఆయన ఒప్పుకుంటున్నాడు. అయినా కూడా అలాంటి చిత్రాలలో చేయడానికి కూడా లావణ్యత్రిపాఠి నుంచి ప్రగ్యాజైస్వాల్‌ వరకు పోటీ పడుతునే ఉన్నారు. ఇక పవన్‌కళ్యాణ్‌ వంటి స్టార్‌ హీరోయిన్‌ సరసన ఓ ఐటం సాంగ్‌ను చేయడానికి నిరాకరించి, పవన్‌ అభిమానుల ఆగ్రహానికి గురైన యాంకర్‌ అనసూయ కూడా నాగ్‌తో చిందులేసిన విషయాన్ని కూడా ప్రముఖంగా చెప్పుకోవాలి. కాగా ప్రస్తుతం నాగ్‌ యాంకర్‌ నుండి డైరెక్టర్‌గా మారిన ఓంకార్‌ దర్శకత్వంలో పివిపి బేనర్‌పై 'రాజు గారి గది2'లో విలక్షణ పాత్రను చేయనున్న సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రంలో ఆయనకు జోడీగా నటించడానికి మరో యంగ్‌ హీరోయిన్‌ ముందుకొచ్చిందని సమాచారం. యంగ్‌ ముంబై భామ సీరత్‌కపూర్‌ ఇందులో ఎంపికైంది. 'రన్‌ రాజా రన్‌, టైగర్‌' వంటి చిత్రాలలో నటించిన ఈ భామ ఆ లక్కీ ఛాన్స్‌ను చేజిక్కించుకుంది. స్టోరీ ప్రకారం ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారని, అందులో ఓ భామగా సీరత్‌ నటిస్తోందని సమాచారం.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement