Advertisementt

శ్రీలంకకి విజయ్ దేవరకొండ

Sun 23rd Mar 2025 05:15 PM
vijay deverakonda  శ్రీలంకకి విజయ్ దేవరకొండ
Vijay Deverakonda heading to Sri Lanka శ్రీలంకకి విజయ్ దేవరకొండ
Advertisement
Ads by CJ

హీరో విజయ్ దేవరకొండ తన కొత్త సినిమా కింగ్ డమ్ సాంగ్ షూట్ కోసం శ్రీలంక వెళ్తున్నారు. ఈ సినిమాలోని ఓ లవ్ సాంగ్ ను ఈ షెడ్యూల్ లో చిత్రీకరించనున్నారు. వారం రోజుల పాటు ఈ షెడ్యూల్ జరుగనుంది. లవ్ సాంగ్స్ చేయడంలో మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ స్పెషాలిటీ అందరికీ తెలిసిందే. కింగ్ డమ్ లవ్ సాంగ్స్ కు కూడా ఆయన బ్లాక్ బస్టర్ ట్యూన్స్ రెడీ చేశారు.

శ్రీలంక వెళ్తున్న విజయ్ ఎయిర్ పోర్ట్ పిక్స్ వైరల్ అవుతున్నాయి. రౌడీ ట్రెండీ సమ్మర్ వేర్ లో స్టైల్ ఐకాన్ గా కనిపిస్తున్నారు విజయ్. రీసెంట్ గా రిలీజ్ చేసిన కింగ్ డమ్ టీజర్ హ్యూజ్ రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. ఏఐతో వీడియోతో రిలీజ్ చేసిన టీజర్ ఒరిజినల్ సౌండ్ ట్రాక్ (OST)కు కూడా భారీ స్పందన వచ్చింది. 

కింగ్ డమ్ చిత్రాన్ని యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి రూపొందిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్ టైన్ మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై నాగవంశీ, సాయి సౌజన్య భారీ పాన్ ఇండియా చిత్రంగా నిర్మిస్తున్నారు. కింగ్ డమ్ సినిమా మే 30న ఈ సినిమా వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.

Vijay Deverakonda heading to Sri Lanka:

Vijay Deverakonda heading to Sri Lanka for KINGDOM song shoot

Tags:   VIJAY DEVERAKONDA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ