కోలీవుడ్ మల్టి టాలెంటెడ్ యాక్టర్ విజయ్ సేతుపతి నిజంగా మహారాజే. రీసెంట్ గా మహారాజ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన విజయ్ సేతుపతి మహారాజ కోసం సింగిల్ పైసా పారితోషికం తీసుకోలేదట. ఇప్పుడు ఇదే కోలీవుడ్, టాలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్. మహారాజ దర్శకనిర్మాతలు ఈ సినిమాకి 20 కోట్ల బడ్జెట్ పెట్టి తీస్తున్నామని చెబితే సరే అని విజయ్ సేతుపతి చెప్పారట.
కథ నచ్చి సినిమాకి పారితోషికం విజయ్ సేతుపతి ఆ సినిమా చేశారట. మరి మహారాజ కోలీవుడ్ లోనే కాదు విడుదలైన తెలుగులోనూ అద్భుతమైన విజయ్ సాధించింది. ఈ చిత్రానికి 100 కోట్లకు పైగానే కలెక్షన్ వచ్చాయి. నిర్మాతలు హ్యాపీ. అటు ఓటీటీలోనూ మహారాజ రికార్డ్ వ్యూస్ సొంతం చేయుకుంది.
అయితే ఎలాంటి పారితోషికం తీసుకోకుండా పని చేసిన విజయ్ సేతుపతికి మహారాజ మేకర్స్ లాభాల్లో వాటాలిస్తామని చెప్పారట. ఇప్పుడు 100 కోట్ల కల్లెక్షన్స్ లో విజయ్ సేతుపతి వాటా వస్తుంది. ఆయన పారితోషికం కింద 10 నుంచి 12 కోట్లు అందుకుంటారు. ఇప్పుడు మహారాజ లాభాల్లో వాట అంటే పారితోషికం కన్నా ఎక్కువే. అయినా విజయ్ సేతుపతి మంచితనానికి మహారాజే అంటూ ఆయన అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు.