Advertisementt

ఆలీ దురదృష్టమేనా?

Sun 30th Jun 2024 02:38 PM
ali  ఆలీ దురదృష్టమేనా?
Is ali unlucky? ఆలీ దురదృష్టమేనా?
Advertisement
Ads by CJ

పవన్ కళ్యాణ్ స్నేహాన్ని వదులుకుని వైసీపీ కి జై కొట్టి పదవి కోసం ప్రాణ స్నేహితుడిని పట్టించుకోకుండా, పవన్ కళ్యాణ్ స్టామినాని అంచనా వెయ్యలేని కమెడియన్ ఆలీ ఇప్పుడు ఓడిపోయినా వారితో ఊరేగడం కరెక్ట్ కాదు, సినిమా ఇండస్ట్రీ అంతా పవన్ కళ్యాణ్ వెనుక నడుస్తున్న సమయంలో తానొక్కడే వైసీపీ ని అంటి పెట్టుకోవడం అనేది తనకే ఎఫెక్ట్ అని, ఇటు సినిమా అవకాశాలు కూడా పోతాయనే భయంతో వైసీపీ కే కాదు రాజకీయాలకు గుడ్ బై చెప్పేసాడు.

అయితే వైసీపీ లోకి వెళ్లి పవన్ ని వదిలెయ్యడం ఆలీ దురదృష్టమే అంటూ పవన్ ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు. పవన్ అభిమాని ఒకరు తన సోషల్ మీడియా హ్యాండిల్ లో ఇలా ట్వీట్ చేసాడు.

కళ్యాణ్ గారిని చూస్తే చాలు.. ఒక్కసారి తాకితే చాలు

ఒక్క ఫోటో దిగితే చాలు.

అని ఎంతో తపించే వాళ్ళు.. ఎంతో దూరం నుండి ఖర్చు పెట్టుకొని సభలకు.. ఆఫీస్ ముందు పడిగాపులు కాసే వాళ్ళు లక్షల్లో ఉన్నారు..

కళ్యాణ్ గారు ఎక్కడ ఉన్నా... ఎటువంటి అడ్డంకులు లేకుండా నేరుగా వెళ్లిపోయే స్థానం ,, స్నేహం నీది..

మీ రెండు కుటుంబాలు.. ఒకే కుటుంబం అనుకునే స్థాయి కి వెళ్లిపోయావ్

నీ ఇంటి నుండి అడిగి మరీ బిర్యానీ తెప్పించుకొనే వారు కళ్యాణ్ గారు.. ఆ అదృష్టం ఎంతమందికి వస్తుంది

ఆలీ నా గుండె లాంటి వాడు అని కళ్యాణ్ గారు అన్నారంటే.. నిన్ను ఏ స్థాయి లో కూర్చోబెట్టారో ఊహించలేకపోయావ్..

పదవులకి, పందెరాల కి కక్కుర్తి పడి ఒక వజ్రాన్ని వదిలేసి.. రంగు రాళ్ళ పంచన చేరావ్.

చివరికి ఆయన ముందు నిలబడే అర్హత కూడా కోల్పోయావ్..

కూడు ఉండే చోట కుక్క ఉండదు అంటారు.

చివరికి కుక్క కంటే హీనం అయిపోయావ్..

నూరేళ్లు వెంట నడిచే స్నేహాన్ని.. మూర్ఖత్వం తో చంపేసుకున్నావ్..

నీ అంత దురదృష్టవంతుడు ఉండడు.. అలీ అంటూ చేసిన ట్వీట్  వైరల్ గా మారింది. 

Is ali unlucky?:

Pawan fans are saying that it is bad luck for Ali to go to YCP and leave Pawan

Tags:   ALI
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ